అమ్మాయిలకు ఈ పిరియడ్స్ వల్ల పెద్ద తలనొప్పి, ఇవి కరెక్టుగా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడే వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పుడు, ట్రిప్స్ ప్లాన్ చేసుకునేప్పుడు మహిళలు ముందు ఆలోచించేది.. డేట్ టైమ్ గురించే. అది దాటిపోతే చాలా రిలీఫ్‌గా ఉంటారు. ఒకవేళ శుభాకార్యాలు ఉన్నప్పుడే డేట్ టైమ్ ఉందంటే.. వారం ముందు నుంచే పిరియడ్స్ పోస్ట్‌పోన్ అయ్యే ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. దాంతో ఫంక్షన్ ఉన్నరోజు డేట్ రాదు.. సమస్య ఉండదు. కానీ అసలు సమస్య అక్కడి నుంచే మొదలవుతుంది. ఇలా వేసుకునే మాత్రల వల్ల శరీరంపై దుష్ప్రభావాలు ఉంటాయి.
ఈ మాత్రలు తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్లలో మార్పు వస్తుంది. దీని వల్ల మొటిమల సమస్య వస్తుంది. ఇలాంటి ఫలితాలు అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి. ఈ రకమైన మాత్రలు తీసుకున్నప్పుడు చాలా మంది మానసిక కల్లోలం అనుభవిస్తారు. కోపం, విసుగు వంటి భావాలు ఎక్కువగా వస్తాయి. కొంతమందికి నిరాశ కూడా ఉంటుంది.
పీరియడ్ డిలే పిల్ హార్మోన్లపై ప్రభావం వల్ల లైంగిక ఆసక్తి కూడా తగ్గుతుందట. రొమ్ములలో నొప్పి ఉంటుంది. రొమ్ములు బిగుతుగా అనిపిస్తాయి. చాలా బాధాకరంగా ఉంటుంది. పిరియడ్స్ వచ్చినప్పుడు స్తనాల్లో కొద్దిగా నొప్పి రావడం సహజమే కానీ ఒత్తిడి కారణంగా పీరియడ్స్ వాయిదా పడినప్పుడు నొప్పి ఇంకా పెరుగుతుంది. ఈ రకమైన మాత్రలు వేసుకున్నప్పుడు కొందరికి ఆయాసం, వాంతులు వస్తాయి. రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది పక్షవాతానికి కూడా దారితీస్తుంది.
ఈ సమస్యకు పరిష్కారం ఏంటి..?
టాబ్లెట్ మోతాదు సరిగ్గా తీసుకోవాలి. అధిక మోతాదులో తీసుకోవద్దు. ఈ రకమైన మాత్రలు మీరే వేసుకోవడం కంటే వైద్యుల సలహా తీసుకోని వేసుకోడం ఉత్తమం.. పిరియడ్స్ పోస్ట్‌పోన్ అయ్యే ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. శరీరంలో నీటిశాతం తగ్గకూడదు. ఆహారం తర్వాత మాత్ర వేసుకోండి. మద్యం అసలే తాగకూడదు.
తరచూ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడటం వల్ల సంతానం కలగడం కూడా కష్టమవుతుంది. నాకు ఇప్పుడు పెళ్లికాదులే అని మీరు అదేపనిగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే.. అది మీ భవిష్యత్తులో కలిగే సంతానంపై ఘోరంగా ప్రభావం చూపిస్తుంది. పిరియడ్స్‌కు సంబంధించి ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడకపోవడమే ఉత్తమం. అది ఒక బుుతుచక్రం.. టైమ్ వచ్చినప్పుడు వస్తుంది. ఆ నాలుగు రోజులు నొప్పులను కూడా భరించాలి. ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెడితే.. పెయిన్స్ కూడా ఉండవు. అంతేగానీ..అవి పోస్ట్‌పోన్ అవ్వడానికి, పెయిన్స్ రాకుండా ఉండటానికి అదేపనిగా మాత్రలకు మాత్రం అలవాటు పడకండి.!