ఆవాలేగా అని లైట్‌ తీసుకుంటున్నారా..? వాటితో ఎన్ని లాభాలో..!!

ఆవాలు లేని పోపు డబ్బా ఉండదు.. అందరి ఇళ్లలో వంటల్లో కచ్చితంగా ఆవాలను వాడతుంటారు. అసలు వీటి వల్ల ఏం ఉపయోగం అని మీరెప్పుడైనా ఆలోచించారా..? అంటే వీటికి పెద్దగా రుచి, వాసన ఉండదు.. ఏదో తాలింపుల్లో వేసినప్పుడు కాస్త అందంగా కనిపిస్తాయి

ఆవాలేగా అని లైట్‌ తీసుకుంటున్నారా..? వాటితో ఎన్ని లాభాలో..!!


ఆవాలు లేని పోపు డబ్బా ఉండదు.. అందరి ఇళ్లలో వంటల్లో కచ్చితంగా ఆవాలను వాడతుంటారు. అసలు వీటి వల్ల ఏం ఉపయోగం అని మీరెప్పుడైనా ఆలోచించారా..? అంటే వీటికి పెద్దగా రుచి, వాసన ఉండదు.. ఏదో తాలింపుల్లో వేసినప్పుడు కాస్త అందంగా కనిపిస్తాయి అంతే కదా అనుకుంటున్నారా..? అసలు ఆవాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాక్‌ అవుతారు. ఎన్నో సమస్యలకు ఆవాలు చక్కటి పరిష్కారం. 

Mustard : వంట‌ల్లో వాడే ఆవాలు మ‌న‌కు ఇంత మేలు చేస్తాయా.. ఇన్నాళ్లూ  తెలియ‌లేదే..

ముఖ్యంగా చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఆవాలు ప్రభావవంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చాలామందిలో శరీరానికి వేడిని కలిగించే ఆహార పదార్థాలు తినడం వల్ల చర్మంపై దురద దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆవాలని వినియోగించాలి. ఇందులో ఉండే మూలకాలు చర్మంపై సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చిట్కాని వినియోగించడానికి మీరు ముందుగా.. 20 గ్రాముల ఆవాలను తీసుకొని ఓ బౌల్లో వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడిలా తయారు చేసుకోవాలి. ఇందులోనే నీటిని వేసి..పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సులభంగా ఉపశమనం లభిస్తుంది.

అంతేకాకుండా ప్రస్తుతం చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల పొట్ట సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆవాలతో తయారుచేసిన 20 మిల్లీ గ్రాముల ఉండను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

ఆవాల నూనెతో కూడా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆవ నూనెను జుట్టుకు రాయడం వల్ల.. జుట్టు రాలడం తలలోని చుండ్రు ఇతర జుట్టు సమస్యలు సులభంగా దూరమవుతాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆవాలతో తయారుచేసిన నూనె ప్రభావవంతంగా సహాయపడుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.