ఫ్లేవర్డ్‌ కండోమ్స్‌ వాడుతున్నారా..? మహిళలకు ఆ ప్రమాదం తప్పదు..

సురక్షితమైన సెక్స్‌ కోసం.. చాలా మంది కండోమ్స్‌ వాడుతుంటారు.. కానీ వీటిని వాడటంలో, ఎంచుకోవడంలో తప్పులు జరుగుతున్నాయి.. కొన్నిసార్లు కండోమ్‌ వేసుకోవడం రాక. అది ఫెయిల్‌ అవడం జరుగుతుంది. దాని ప్రభావం ఆ అమ్మాయి మీద పడుతుంది.

ఫ్లేవర్డ్‌ కండోమ్స్‌ వాడుతున్నారా..? మహిళలకు ఆ ప్రమాదం తప్పదు..


సురక్షితమైన సెక్స్‌ కోసం.. చాలా మంది కండోమ్స్‌ వాడుతుంటారు.. కానీ వీటిని వాడటంలో, ఎంచుకోవడంలో తప్పులు జరుగుతున్నాయి.. కొన్నిసార్లు కండోమ్‌ వేసుకోవడం రాక. అది ఫెయిల్‌ అవడం జరుగుతుంది. దాని ప్రభావం ఆ అమ్మాయి మీద పడుతుంది. అలాగే.. చాలా మంది ఫ్లేవర్‌ కండోమ్స్‌ వాడుతుంటారు..చాక్లెట్, బబుల్గమ్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్‌ ఇలా ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్‌ ఉన్నాయి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్లేవర్డ్ కండోమ్స్‌లో చక్కెర ఉంటుంది. ఇది మీ యోనికి అనేక సమస్యలను కలిగిస్తుంది.

This Is the Best Time to Have Sex (Hint: It's Not at Night) | The Healthy  @Reader's Digest

కండోమ్స్‌లో అధిక చక్కెర కంటెంట్ యోని పీహెచ్ని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. ఎక్కువ ఆనందం కోసం వీటిని వాడితే ఫ్లేవర్డ్ కండోమ్స్ స్త్రీ యోనిలో పీహెచ్ స్థాయిలను మారుస్తుందని నిపుణులు అంటున్నారు. మహిళా పార్టనర్ దీని ఫలితంగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ని అనుభవిస్తుంది. కండోమ్స్లోని కెమికల్ కంటెంట్ పెరిగేకొద్దీ యోని చిరాకు, ఈస్ట్ ఇన్ఫెక్షన్ కూడా పెరుగుతుంది.

ఓరల్స్ శృంగారం కోసం ప్రత్యేకంగా ఫ్లేవర్లతో కూడిన కండోమ్స్ తయారు చేస్తారు. కండోమ్స్‌కు రుచులను జోడిస్తారు.. ఎందుకంటే.. రబ్బరు స్మెల్‌ వస్తే.. ఓరల్‌ సెక్స్‌ చేయలేరు..   

ఈ సమస్యలు తప్పవు..

ఓరల్ శృంగారం, యోనితో శృంగారం చేసే సమయంలో కండోమ్స్ వాడాలి. ఎందుకంటే యోని, పురుషాంగం ఉత్సర్గ కారణంగా నోటి ఇన్ఫెక్షన్స్ రావొచ్చు. ఇది పొందిన రోగనిరోధక లోపం సిండ్రోమ్ అంటే ఎయిడ్స్, హెర్పెస్, గోనేరియా, సిఫిలిస్, కాన్డిడియాసిస్కి కారణం కావొచ్చు.

ప్రెగ్నెంట్ రాకుండా ఉండాలంటే, ఆ దంపతులు ఇంకా పిల్లలను కనడానికి సిద్ధంగా లేకుంటే, ఇప్పటికే పిల్లలు ఉన్నా, గర్భం మధ్య టైమ్ ఉండాలనుకుంటే గర్భ నిరోధక పద్దతులను ఉపయోగించాలి. అయితే ఈ మాత్రలను కూడా ఎలా పడితే అలా వాడితే.. స్త్రీల ఆరోగ్యం దెబ్బతింటుంది.. బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌ వేసుకోవచ్చు.. కానీ ఐపిల్‌ వేసుకోవడం మాత్రం చాలా ప్రమాదం.. ఒక్క ఐపిల్‌ 15 బర్త్‌ కంట్రోల్‌ పిల్స్‌తో సమానం.. మీరు అలాంటి ఐపిల్‌ ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే వేసుకోవాలి.. కానీ చాలమంది.. ఈ పిల్స్‌ను.. సెక్స్‌. జరిగిన ప్రతిసారి వాడుతున్నారు. దీనివల్ల.. వారు భవిష్యత్తులో శాశ్వతంగా పిల్లలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.