ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు ముట్టుకోరు.. ప్రాణాలకు ప్రమాదమే...

ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు చేతిలో ఫోన్ లేకుంటే చాలా మందికి నిద్రపట్టదు తెలుసా.. అంతలా ఫోన్ కు అలవాటు పడ్డారు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వీటిని ఉయోగిస్తున్నారు. వీటి వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి

ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా? ఈ విషయం తెలిస్తే అస్సలు ముట్టుకోరు.. ప్రాణాలకు ప్రమాదమే...


ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు చేతిలో ఫోన్ లేకుంటే చాలా మందికి నిద్రపట్టదు తెలుసా.. అంతలా ఫోన్ కు అలవాటు పడ్డారు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వీటిని ఉయోగిస్తున్నారు. వీటి వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో సంభాషించడానికి అలాగే సినిమాలు, ఆటలు, చదువు విషయంలో ఇలా అనేక రకాలుగా స్మార్ట్ ఫోన్స్ మనకు ఉపయోగపడతాయి. అయితే ఈ ఫోన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ ను ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతినడంతో పాటు మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఫోన్ లను ఉపయోగించడం వల్ల చర్మం కూడా దెబ్బతింటుదని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఫోన్ ను ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి నష్టాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Teenage Cell Phone Addiction: Are You Worried About Your Child?


ఈ ఫోన్ల వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయని మనలో చాలా మందికి తెలియదు. మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు వచ్చని తరువాత వాటిని తొలగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే సమస్య వచ్చిన తరువాత జాగ్రత్తపడడానికి బదులుగా సమస్య తలెత్తకుండా చూసుకోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్లను ఉపయోగించినప్పటికి కొన్ని చిట్కాలను వాడడం వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..


అలాగే ఫోన్ ను ఎప్పుడూ ముఖానికి దగ్గరగా ఉంచుకోకూడదు. ఫోన్ ను ముఖానికి ఎదురుగా ఉంచుకోవడం వల్ల బ్యాక్టీరియా ఫోన్ నుండి ముఖానికి వ్యాప్తిస్తుంది. దీంతో చర్మం దెబ్బతినడంతో పాటు చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఫోన్ ను ఎల్లప్పుడూ యాంటీ బ్యాక్టీరియల్ వైప్స్ తో తుడుచుకుంటూ ఉండాలి. 70 శాతం ఆల్కహాల్ ఉండే వైప్స్ తో ఫోన్లను తుడుచుకోవడం వల్ల బ్యాక్టీరియా చాలా వరకు నశిస్తుంది. అలాగే చాలా మంది ఫోన్ లను టాయిలెట్ లలోకి కూడా తీసుకెళ్లి వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్ లపై బ్యాక్టీరియా మరింతగా చేరే అవకాశం ఉంటుంది.. అందుకే ఫోన్ ను వీలైనంతవరకు దూరంగా పెట్టడం మంచిదని నిపుణులు సలహ ఇస్తున్నారు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.