Ashwagandha milk : పురుషులు రాత్రి పాలల్లో అశ్వగంధ కలిపి తాగితే ఆ పవర్‌ పెరుగుతుందట..

Ashwagandha milk for men : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదే మనందరికి తెలుసు.. పాలల్లో కొన్ని కలుపుకోని తాగితే.. మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.. నిద్రలేమి సమస్యకు, ముఖ్యంగా పురుషుల్లో శృంగార సమార్థ్యాన్ని పెంచేందుకు కూడా ఆయుర్వేదం ప్రకారం కొన్ని చిట్కాలను ఉపయోగించవచ్చు.

Ashwagandha milk : పురుషులు రాత్రి పాలల్లో అశ్వగంధ కలిపి తాగితే ఆ పవర్‌ పెరుగుతుందట..
Ashwagandha milk for men


Ashwagandha milk for men : పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదే మనందరికి తెలుసు.. పాలల్లో కొన్ని కలుపుకోని తాగితే.. మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.. నిద్రలేమి సమస్యకు, ముఖ్యంగా పురుషుల్లో శృంగార సమార్థ్యాన్ని పెంచేందుకు కూడా ఆయుర్వేదం ప్రకారం కొన్ని చిట్కాలను ఉపయోగించవచ్చు. ఈరోజుల్లో చాలామంది పురుషులు వంధత్వ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల వారి లైంగిక జీవితం సరిగ్గా లేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు.
 
మ‌గ వారు రాత్రి పూట పాల‌ను తాగ‌డం వ‌ల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ‌గా విడుద‌ల అవుతుంద‌ని, దీంతో ర‌తిలో చురుకుగా పాల్గొన‌వచ్చ‌ని చాలా మంది నమ్ముతారు.. కానీ ఇదంతా అపోహ మాత్ర‌మే అని నిపుణులు అంటున్నారు. పాల‌కు టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను ఎక్కువ‌గా విడుద‌ల‌య్యేలా చేసే శ‌క్తి లేద‌ని, ఎటువంటి ప‌రిశోధ‌న‌ల‌ల్లో కూడా ఇది నిరూపించ‌బ‌డ‌లేద‌ని వారు చెబుతున్నారు. అయితే పాల‌లో రాత్రి పూట అశ్వ‌గంధ చూర్ణాన్ని క‌లుపుకుని తాగితే మేలు జ‌రుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. రాత్రి పూట నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో ఒక టీస్పూన్ అశ్వ‌గంధ చూర్ణం క‌లిపి తాగితే.. ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

పాలల్లో ఆశ్వగంధ కలిపి తాగితే..

అశ్వ‌గంధ చూర్ణాన్ని రాత్రి పూట పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా పురుషుల‌కు బాగా మేలు జ‌రుగుతుంది. శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు. వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి.
అశ్వ‌గంధ చూర్ణాన్ని ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల డిప్రెష‌న్‌, ఒత్తిడి వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు తొలగిపోయి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అశ్వగంధ మగవారి పాలిట వరం అనే చెప్పాలి. ఎవరిలో అయితే లైంగిక సామర్థ్యం తక్కువగా ఉందో..వారి టిప్‌ను రెగ్యులర్‌గా పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.