ఒకప్పుడు తక్కువ సంఖ్యలో ఉండే గుండె జబ్బుల బాధితులు. ప్రస్తుత రోజుల్లో ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అయితే ఈ సమస్యలు వచ్చినపుడు గుండెకు వైద్యులు స్టంట్ వేస్తారు. దీంతో మూసుకుపోయిన రక్తనాళాలు తెరుచుకుని మళ్లీ యథావిధిగా రక్తం సరఫరా అవుతుంది. అయితే గుండె సమస్యలు వచ్చినప్పుడు స్టంట్ వేయకుండా.. లేజర్ చికిత్సతో సులభంగా నయం చేయవచ్చని దిల్లీ వైద్యులు చెబుతున్నారు. ఆ చికిత్స గురించి తెలుసుకుందాం.
లేజర్ సర్జరీ ఎలా చేస్తారు.. లేజర్ థెరపీతో ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి అధిక శక్తి కాంతి (లేజర్) విడుదల చేసే కాథెటర్ ఉపయోగిస్తారు. అది సిరలకు (Veins) ఎటువంటి హాని కలిగించకుండా బ్లాక్‌ను తొలగిస్తుంది. ఈ చికిత్సను ప్రతి రోగిలో ప్రయోగించలేరు. ముందుగా రోగిని పరీక్షించి సిరల్లో ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తెలుసుకుంటారు.
ఈ పరీక్షలు అనంతరం లేజర్ టెక్నాలజీ విజయవంతమవుతుందో లేదో అన్న విషయాన్ని పరిశీలించి చికిత్స చేస్తారు. ఈ లేజర్ చికిత్సకు మూడు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. స్టంట్ వేసేందుకు అయ్యే ఖర్చు ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయలు ఉంటుంది.
అయితే ఈ థెరపీ వలన ఎన్నో లాభాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ థెరపీ వల్ల రోగి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారట. ఆస్పత్రికి వచ్చిన రోజే చికిత్స పూర్తయి పేషెంట్ డిశ్చార్జ్ అవుతారు. అదే స్టంట్ వేస్తే డిశ్చార్జి అవ్వడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుంది.
మనదేశంలో ఎక్కడ చేస్తారు....
భారత్లో గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్ సహా దేశంలోని అనేక ఆస్పత్రుల్లో గుండె సమస్యలతో బాధపడేవారికి స్టంట్ బదులు లేజర్ థెరపీతో చికిత్స చేస్తున్నారు. స్టంటింగ్ ప్రక్రియ కంటే లేజర్ థెరపీ చాలా సులభమైనదని.. దీనివలన వ్యక్తి త్వరగా కోలుకునే అవకాశం సైతం ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.