ఆయర్వేదం : షుగర్‌, బీపీకి రావి బెరడు అద్భుతంగా పనిచేస్తుందట..!

ఈరోజుల్లో షుగర్‌, బీపీ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. ఇవి దీర్ఘకాలిక రోగాలు.. ఒక్కసారి వచ్చాయంటే.. చచ్చే వరకూ పోవు. వీటిని కంట్రోల్లో ఉంచుకోకపోతే మనం రెస్ట్ ఇన్‌ పీస్‌లోకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచే ఇవి

ఆయర్వేదం : షుగర్‌, బీపీకి రావి బెరడు అద్భుతంగా పనిచేస్తుందట..!


ఈరోజుల్లో షుగర్‌, బీపీ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. ఇవి దీర్ఘకాలిక రోగాలు.. ఒక్కసారి వచ్చాయంటే.. చచ్చే వరకూ పోవు. వీటిని కంట్రోల్లో ఉంచుకోకపోతే మనం రెస్ట్ ఇన్‌ పీస్‌లోకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచే ఇవి రాకుండా జాగ్రత్తపడాలి. మన చేతుల్లా ఉందా అంటారేమో.. అవును ఈ రోగాలను రాకుండా చూసుకోవడం, వచ్చేలా చేయడం ఇదంతా మీరు చేసే పనుల బట్టే అవుతుంది. షుగర్‌, బీపీ రాకుండా ఉండాలంటే.. బరువు కంట్రోల్లో ఉండాలి, బయట ఆహారాలను తగ్గించాలి, వేళకు తినాలి, టెన్షన్‌, ఆందోళన ఉండొద్దు. సరే వచ్చేసింది ఇంక ఏం చేయాలి..? ఆయుర్వేద వైద్యం ద్వారా సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాకుండా వీటిని కంట్రోల్‌ చేసుకోవచ్చు. రావి బెరడు షుగర్‌, బీపీకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 

ఆయుర్వేదంలో మధుమేహాన్ని నియంత్రించడంలో రావి బెరడు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిజానికి, ఇందులో చాలా యాంటీ-డయాబెటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా నిరోధిస్తాయి. దీని నుంచి బయటపడాలంటే రావి బెరడును నీళ్లలో మరిగించి, చల్లారిన తర్వాత తాగవచ్చు. అదే సమయంలో రావి యొక్క పొడి బెరడును గ్రైండ్ చేసిన తర్వాత, దాని పొడిని గోరువెచ్చని నీటితో తాగవచ్చు.

అధిక రక్తపోటును నియంత్రించడానికి రావి చెట్టు బెరడును కూడా ఉపయోగించవచ్చు. హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులకు రావి బెరడు బాగా పనిచేస్తుంది. రావి బెరడును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ధమనుల అడ్డంకిని తెరవడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. బరువు తగ్గుతారు.

శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి రావి బెరడు కూడా చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. నిజానికి, వేప, రావి చెట్టు కూడా అనేక యూరిక్ యాసిడ్ తగ్గించే లక్షణాలను కలిగి ఉంది. రావి బెరడును నీళ్లలో మరిగించి డికాషన్‌ తయారు చేసుకోవాలి. ఈ డికాషన్‌ను ఉదయం, సాయంత్రం అరకప్పు తాగాలి. ఇలా చేయడం వల్ల మీరు త్వరగా ఉపశమనం పొందుతారు.

దగ్గు సమస్యను వదిలించుకోవడానికి రావి బెరడు యొక్క కషాయాలను త్రాగవచ్చు. దీంతో దగ్గు సమస్య పూర్తిగా తగ్గుతుంది. దగ్గు సమస్య నుంచి బయటపడటానికి, 1 గ్లాసు నీటిలో 2 నుంచి 3 బెరడులను వేయండి. దీన్ని బాగా ఉడకబెట్టండి. నీరు బాగా మరిగించి.. గోరువెచ్చలు అయ్యాక. పుక్కిలించండి. దీంతో దగ్గు సమస్యను దూరం చేసుకోవచ్చు. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.