ఆడవారి ఆరోగ్యానికి అరటిపువ్వు ఎంతో మంచిదట..! 

అరటి చెట్టు నుంచి వచ్చే ప్రతి పార్ట్‌ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటి ఆకులో భోజనం చేస్తే ఎంతో ఆరోగ్యం..అరటిచెట్టుకు అరటిపువ్వు వస్తుంది. అరటి పండ్లను తింటారుకానీ.. చాలామంది ఈ పువ్వును పక్కనపడేసతారు.

ఆడవారి ఆరోగ్యానికి అరటిపువ్వు ఎంతో మంచిదట..! 
Banana Flower


అరటి చెట్టు నుంచి వచ్చే ప్రతి పార్ట్‌ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటి ఆకులో భోజనం చేస్తే ఎంతో ఆరోగ్యం.. అరటి చెట్టుకు అరటి పువ్వు వస్తుంది. అరటి పండ్లను తింటారుకానీ.. చాలామంది ఈ పువ్వును పక్కనపడేసతారు. కొంతమంది దీంతో కూరచేసుకుంటారు. అసలు అరటిపువ్వు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి చూద్దామా..!
అర‌టి పువ్వు డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తుంది. సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. అర‌టి పువ్వును తిన‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఇన్సులిన్ లెవ‌ల్స్ పెరుగుతాయి. శ‌రీరం ఇన్సులిన్‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

అర‌టి పువ్వులో మెగ్నిషియం ఉంటుంది. ఇది మూడ్‌ను మారుస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గిస్తుంది. డిప్రెష‌న్‌ను దూరం చేస్తుంది. అర‌టి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క‌ణాలు దెబ్బ తిన‌కుండా చూస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేస్తాయి. శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
క‌డుపు నొప్పి, గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పువ్వును వండుకుని తింటే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అర‌టి పువ్వుల్లో ఉండే ఔష‌ధ గుణాలు సూక్ష్మ క్రిముల‌ను చంపేస్తాయి. దీని వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు.
మ‌హిళ‌లు రుతు స‌మ‌యంలో అర‌టి పువ్వును తీసుకుంటే నొప్పి, అధిక ర‌క్త‌స్రావం త‌గ్గుతాయి. పీసీవోఎస్ స‌మ‌స్య ఉన్న‌వారు అర‌టి పువ్వును తింటుంటే సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు.
అర‌టి పువ్వును తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ పెరుగుతాయి. దీంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. పాలిచ్చే త‌ల్లులు అర‌టి పువ్వును తింటుండ‌డం వ‌ల్ల వారిలో పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి.
అరటిపువ్వులో ఉంటే విటమిన్-C వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మూత్రపిండాల వ్యాధుల‌తో బాధపడేవారు, కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా అరటి పువ్వు మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.