యవ్వనంగా మెరిసిపోవాలా.. వీటికి దూరంగా ఉండండి.. 

వృద్ధాప్యం.. కొన్నాళ్ల క్రితం వరకు వృద్ధాప్యం అంటే 50 60 ఏళ్ల తర్వాత వచ్చేదిగా చూసేవారు. అయితే ప్రస్తుతం చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. శరీరం ముడతలు పడటం మొహం మీద చర్మం

యవ్వనంగా మెరిసిపోవాలా.. వీటికి దూరంగా ఉండండి.. 
Beauty tips


వృద్ధాప్యం.. కొన్నాళ్ల క్రితం వరకు వృద్ధాప్యం అంటే 50 60 ఏళ్ల తర్వాత వచ్చేదిగా చూసేవారు. అయితే ప్రస్తుతం చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. శరీరం ముడతలు పడటం మొహం మీద చర్మం సాగినట్లు అవ్వటం వంటి లక్షణాలన్నీ చిన్న వయసులోనే కనిపించడం కొంత కలవరపెట్టే విషయం అనే చెప్పాలి. అయితే వృద్ధాప్య లక్షణాలను దూరం చేసుకోవాలి అంటే ముఖ్యంగా నాలుగు రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు అవేంటో చూద్దాం..

నిత్యం యవ్వనంగా మెరిసిపోవాలని ఎవరికీ ఉండదు అలా ఉండాలి అంటే కచ్చితంగా ఆహార నియమాలు పాటించాలి అంటున్నారు నిపుణులు ముఖ్యంగా పాలకు సంబంధించిన పదార్థాలను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి పాలు అన్ని రకాలుగా శరీరానికి శక్తిని అందించే పదార్థం అయినప్పటికీ కొన్ని శరీర తత్వాలు వారికి పాలు సంబంధిత పదార్థాలు పడవు..

పాలు, పెరుగు, చీజ్, వెన్న, నెయ్యి, పన్నీరు వంటి పదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. ఇవి కొందరి శరీరానికి సరిపడక పోగా కడుపులో మంట వంటి సమస్యలను తీసుకువస్తాయి శరీరంలో విపరీతమైన వేడిని పెంచుతాయి ఇలాంటి వారు ఈ పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది..

అలాగే వనస్పతిని కూడా తీసుకోకపోవడమే మంచిది. ఇది తొందరగా వృద్ధాప్య లక్షణాలు వచ్చేటట్టు చేస్తుంది. అలాగే రోజు ఏదో ఒక రకంగా కాఫీ ఓ.. టీ లోను తెల్ల చక్కెరను తీసుకుంటూనే ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఏమాత్రం ఉపయోగం ఉండకపోగా మరింత చెడు జరుగుతుంది. అందుకే తెల్లచక్కెరను వాడకపోవడం చాలా మంచిది. దానికి బదులుగా బెల్లాన్ని ఉపయోగించాలి. అలాగే రుచికరంగా ఉన్నాయి కదా అని తరచూ వేయించిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్లేదు కానీ తరచు వీటిని తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు తొందరగా వచ్చే అవకాశం ఉంది.. రోజు తప్పకుండా ఆరు నుంచి పది గ్లాసులు నీళ్లు తీసుకోవడంతోపాటు ఏ కాలంలో దొరికే పళ్ళను ఆ కాలంలో ఎక్కువగా తినటం వల్ల శరీరం మంచి నిగారింపును సంతరించుకుంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.