Beauty Tips : బంగాళదుంప తొక్కలను ఫేస్‌కు వాడితే మచ్చలు, మొటిమలు మాయం..!!

Beauty Tips : కొన్ని కూరగాయలను అందరూ పైన తొక్కతీసే వంట చేస్తారు.. కానీ మీరు తొక్కతీసే ప్రతిదీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రూట్స్‌లో కూడా చూసుకుంటే.. అరటి, బత్తాయి, దానిమ్మ ఈ తొక్కలన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి..

Beauty Tips : బంగాళదుంప తొక్కలను ఫేస్‌కు వాడితే మచ్చలు, మొటిమలు మాయం..!!


Beauty Tips : కొన్ని కూరగాయలను అందరూ పైన తొక్కతీసే వంట చేస్తారు.. కానీ మీరు తొక్కతీసే ప్రతిదీ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రూట్స్‌లో కూడా చూసుకుంటే.. అరటి, బత్తాయి, దానిమ్మ ఈ తొక్కలన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి.. కాకపోతే అవి మనం డైరెక్టుగా తినలేం.. అలాగే బంగాళదుంప తొక్క కూడా..ఇది అయితే మీ చర్మానికి చాలా బాగా పనిచేస్తుందట. చ‌ర్మంపై మ‌చ్చ‌లు రావ‌డం, చ‌ర్మం రంగులో తేడాలు ఉండ‌డం మొద‌లైన‌ సమస్యలు అన్నీ పోతాయి.. 

ఆలుగ‌డ్డ‌లో పుష్క‌లంగా ల‌భించే జింక్, ఐర‌న్, ప్రొటీన్ ఇంకా అజెలైక్ యాసిడ్ మొద‌లైన‌వి చ‌ర్మంపై న‌ల్ల‌ మ‌చ్చ‌ల‌ను త‌గ్గించి స్కిన్ టోన్ని పెంచుతాయి. దాని వ‌ల్ల చ‌ర్మంపై నిగారింపు వ‌స్తుంది. కొన్ని రోజుల పాటు ఆలుగ‌డ్డ‌ జ్యూస్ తాగ‌డం వ‌ల‌న చ‌ర్మంపై న‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌ల ద్వారా ఏర్ప‌డిన మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. చాలా మంది మ‌హిళ‌లు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు వివిధ ర‌కాల ర‌సాయ‌నాలతో కూడిన క్రీముల‌ను వాడుతూ ఉంటారు. అయితే ఈ క్రీములు దీర్ఘ కాలంలో హాని కార‌కంగా మారుతాయి. కానీ ఆలుగ‌డ్డలోని స‌హ‌జ‌ సిద్ధ‌మైన గుణాలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌పై ర‌సాయ‌నాల కంటే మెరుగ్గా ప‌ని చేస్తాయట..  

ఫేస్‌కు బంగాళదుంప చెక్కలను ఎలా వాడాలంటే..

ఆలుగ‌డ్డ‌ల‌ని బాగా క‌డిగి వాటి తొక్క‌ను తొల‌గించాలి. ఈ తొక్క‌ను తీసుకొని ముఖంపై నెమ్మ‌దిగా రుద్దాలి. త‌రువాత దానిని అలాగే 5 నుంచి 10 నిమిషాల వ‌ర‌కు ముఖంపై ఉంచాలి. ఆ త‌రువాత తొక్క‌ని తీసేసి ముఖాన్ని చ‌ల్లని నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల‌న చ‌ర్మం సున్నితంగా మారి ముఖంపై స‌హ‌జ‌మైన నిగారింపు వ‌స్తుంది.
ఈ ఆలు తొక్క‌ల‌ను ట‌మాటా గుజ్జుతో క‌లిపి దీనిలో కొంచెం ప‌సుపు కూడా క‌లుపుకొని ముఖంపై ప్యాక్ లాగా అప్లై చేసి 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత చ‌ల్ల‌ని నీళ్ల‌తో క‌డ‌గాలి. ఇలా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల‌న చ‌ర్మం మొద్దుబార‌డం త‌గ్గి న‌ల్ల‌ని మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. అలాగే ఫ్రిజ్‌లో ఉంచి చ‌ల్ల‌బరిచిన ఆలూ తొక్క‌ల‌ను క‌ళ్ల కింద ఉంచ‌డం వ‌ల‌న క‌ళ్ల కింద ఉండే న‌ల్ల‌ని మ‌చ్చ‌లు ఇంకా క‌ళ్ల కింద ఉబ్బెత్తుగా ఉండ‌డం కూడా తగ్గిపోతుంది.. ఎలాగో వారానికి ఒక్కసారి అయినా బంగాళదుంప కూర చేసుకుంటారు.. అప్పుడు మీరు ఆ తొక్కలను ఇలా వాడేయండి..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.