Aloe vera and Hibiscus : కలబందను ఇలా వాడితే జుట్టు రాలదు..ఈ మందార నూనెతో వెంట్రుకల నెరవవు..!

Aloe vera వల్ల చర్మానికి, జుట్టుకు చాలా మేలు జరుగుతుంది. దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. Aloe vera ను అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇంకా ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగించడానికి, చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా Aloe vera ఎంతగానో ఉపయోగపడుతుంది.

Aloe vera and Hibiscus  : కలబందను ఇలా వాడితే జుట్టు రాలదు..ఈ మందార నూనెతో వెంట్రుకల నెరవవు..!
Hair Growth


Aloe vera వల్ల చర్మానికి, జుట్టుకు చాలా మేలు జరుగుతుంది. దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. Aloe vera ను అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇంకా ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు తొలగించడానికి, చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అందరూ చెప్తారు. కానీ దీన్ని వాడేతీరున వాడితేనే ఆ ప్రయోజనాలు అన్నీ పొందగలుగుతారు. ఇంతకీ జుట్టు పెరుగుదలకు కలబందను ఎలా వాడాలో చూద్దామా..!
ఔషధ పదార్ధాలతో సమృద్ధిగా ఉన్న అలోవెరా జెల్ అనేక జుట్టు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. అలోవెరా జెల్ జుట్టు పెరుగుదలకు ఉత్తమ ఔషధంగా కూడా నిరూపించబడుతుంది. కలబందను నేరుగా జుట్టుకు పట్టించడం ద్వారా జుట్టు పెరుగుదల వేగవంతం అవుతుంది. ఈ సందర్భంలో, తాజా కలబంద ఆకును విరిచి మధ్యలో కత్తిరించాలి. ఇప్పుడు ఆకు లోపలి భాగాన్ని జుట్టు మీద రుద్దాలి

కలబంద, ఉసిరి వంటివి కూడా జుట్టు సంరక్షణలో జుట్టు పొడవుగా ఒత్తుగా చేయడానికి ఉపయోగపడతాయి..దీని కోసం, ఉసిరి రసంతో కలబంద జెల్ మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. 15-20 నిమిషాల తరువాత, జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.

కలబందలోని తెల్లటి గుజ్జును వేరు చేసి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. కలబందతో తయారు చేసిన నేచురల్ హెయిర్ మాస్క్‌లు కూడా జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. ఇందుకోసం అలోవెరా జెల్‌లో తేనె, గుడ్డులోని తెల్లసొన, మెంతి గింజలు, జొజోబా నూనె కలిపి జుట్టుకు పట్టించాలి.
మందారం కూడా..
మందార పువ్వు , దాని ఆకులు కూడా మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి.. మందార నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు రూట్స్‌ నుంచి బలపడటమే కాకుండా ఒత్తుగా మారుతుంది. దీనితో పాటు, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను కూడా నివారిస్తుంది .వాటిని మృదువుగా చేస్తుంది. ఈ మార్గాల్లో మందార నూనెను ఉపయోగించడం ద్వారా మీరు మీ జుట్టును రూట్ నుండి బలంగా మార్చుకోవచ్చు.

 
హైబిస్కస్‌లో ఉండే విటమిన్-సి ,యాంటీ ఫంగల్ గుణాలు స్కాల్ప్ చుండ్రు లేకుండా చేస్తుంది. అందుకని తలలో దురద, చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందాలంటే దానితో చేసిన నూనెను తప్పనిసరిగా వాడాలి.
 
మందార పువ్వు జుట్టుకు పోషణనిస్తుంది. ఇందులో ఉండే విటమిన్-సీ జుట్టును ఒత్తుగా మార్చడంలో కూడా సహాయపడుతుంది. ఇది జుట్టు ఆరోగ్యకరమైన పెరుగుదలకు దారితీస్తుంది జుట్టు మందంగా,పొడవుగా మారుతుంది. 
మందార నూనె ఎలా చేయాలంటే.. 
 
మందార పువ్వులు , ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక కప్పు కొబ్బరి నూనెను వేడి చేసి, దానిలో మందార పేస్ట్ వేయండి. కొన్ని నిమిషాలు వేడి చేసిన తర్వాత, పాన్ మీద మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేయండి. నూనె చల్లారిన తర్వాత జార్ లేదా సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెతో జుట్టుకు అవసరమైనంత మసాజ్ చేయండి. మసాజ్ చేసిన 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఇది వారానికి మూడు సార్లు ఉపయోగించవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.