Gorakshasana : ఈ ఆసనం వేయడం వల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం, వీర్య వృద్ధి..!

Gorakshasana : ఆసనాలతో అద్భుతాలు సృష్టించడం యోగా ప్రత్యేకత.. ఎలాంటి సమస్యను అయినా.. ఆయా ఆసనాలు వేసి నయం చేసుకోవచ్చు.. మనకు తెలియాల్సిందల్లా.. ఏ ఆసనం వేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని..

Gorakshasana : ఈ ఆసనం వేయడం వల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం, వీర్య వృద్ధి..!


Gorakshasana : ఆసనాలతో అద్భుతాలు సృష్టించడం యోగా ప్రత్యేకత.. ఎలాంటి సమస్యను అయినా.. ఆయా ఆసనాలు వేసి నయం చేసుకోవచ్చు.. మనకు తెలియాల్సిందల్లా.. ఏ ఆసనం వేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని.. బరువు తగ్గించుకోవడాని, ఆస్థమా నయం చేసుకోవడాని, మోకాళ్లనొప్పులకు, షుగర్‌, బీపీ, నిద్రలేమి ఇలా ఏ సమస్య ఉన్నా.. యోగాలో వాటికోసం కొన్ని ఆసనాలు ఉన్నాయి.. అవి రోజు వేయడం వల్ల మన సమస్యలను నయం చేసుకోవచ్చు. ఇక ప్ర‌త్యేకంగా స్త్రీ, పురుషుల కోసం వేర్వేరు ఆసనాలు ఉంటాయి. వాటిని వేయ‌డం వ‌ల్ల వారికి వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇప్పుడు చెపపే ఆస‌నం పురుషుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి ఆ ఆస‌నం ఏమిటి ? దాన్ని ఎలా వేయాలో చూద్దామా..!

పురుషుల‌కు గోర‌క్షాస‌నం వేయ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. ముందుగా నేల‌పై ప‌ద్మాస‌నంలో కూర్చోవాలి. త‌రువాత చిత్రంలో చూపిన‌ట్లుగా రెండు చేతుల‌ను రెండు మోకాళ్ల‌పై ఉంచాలి. పాదాల‌ను రెండింటినీ ద‌గ్గ‌రికి తెచ్చి ఒక‌దానికి ఒక‌టి అతికించిన‌ట్లు పెట్టాలి. త‌రువాత రెండు చేతుల‌ను మోకాళ్ల మీద నుంచి తీసి కుడి చేత్తో ఎడ‌మ మ‌డ‌మ‌ను, ఎడ‌మ చేత్తో కుడి మ‌డ‌మ‌ను చిత్రంలో చూపిన‌ట్లుగా ప‌ట్టుకోవాలి. ఈ భంగిమ‌లో వీలైనంత సేపు ఉండండి.. రోజూ ఈ ఆస‌నాన్ని క‌నీసం 10 నిమిషాల పాటు వేస్తే చాలు..

గోర‌క్షాస‌నం వేయ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు..

ఈ ఆస‌నం వేయ‌డం వ‌ల్ల పురుషుల‌కు వీర్యం అధికంగా ఉత్ప‌త్తి అవుతుంది. 
శృంగార స‌మ‌స్య‌లు పోతాయి. శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. 
సంతాన లోపం ఉన్న‌వారు ఈ ఆస‌నం వేస్తే త‌ప్పక ఫ‌లితం ఉంటుంది. 
ఇక ఈ ఆసనం వేయ‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

ఈ ఆస‌నాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ వేస్తుంటే స్త్రీల‌లోనూ గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు పోతాయి. జీర్ణాశ‌యంలో ఉండే గ్యాస్ మొత్తం దెబ్బ‌కు పోతుంది. అలాగే పొట్ట దగ్గ‌ర ఉండే కొవ్వు క‌రుగుతుంది. అక్క‌డి కండ‌రాలు దృఢంగా మారుతాయి. 

వీరు వద్దు..

మోకాళ్ల నొప్పులు ఉన్న‌వారు, మ‌డ‌మ‌ల నొప్పులు ఉన్న‌వారు, పేగుల్లో స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఈ ఆస‌నాన్ని వేయ‌రాదు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.