saffron water : రోజూ ఉదయం కుంకుమపువ్వు నీళ్లు తాగితే ఎన్ని లాభాలో..!!

saffron flower .. పరిచయం అక్కర్లేని ఔషధం. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టాక్సిన్ల‌ను(విష ప‌దార్థాల‌ను) బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టం తగ్గుతుంది. కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం తేమ‌గా, మృద‌వుగా ఉంటుంది.

saffron water : రోజూ ఉదయం కుంకుమపువ్వు నీళ్లు తాగితే ఎన్ని లాభాలో..!!
benefits of drinking saffron water every morning


saffron flower .. పరిచయం అక్కర్లేని ఔషధం.. చిన్నపిల్లలను అడిగినా చెప్తారు.. Saffron flower వాడితే.. పుట్టే బిడ్డలు తెల్లగా పుడతారు అని.. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని.. వంటల్లో కూడా ఇది ఎక్కువగా వాడతారు. కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో మీకు తెలుసా..? ఇవి తెలుసుకున్నారంటే.. మీరు అస్సలు వదిలిపెట్టరు..! అన్ని లాభాలు ఉన్నాయి మరీ..!
కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి టాక్సిన్ల‌ను(విష ప‌దార్థాల‌ను) బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టం తగ్గుతుంది. కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం తేమ‌గా, మృద‌వుగా ఉంటుంది. మొటిమ‌లు, మ‌చ్చ‌లు త‌గ్గుతాయి. చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది.
రుతు స‌మ‌యంలో విపరీతంగా ర‌క్త స్రావం అయ్యే మ‌హిళ‌లు కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో పాటు రుతు స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు త‌గ్గుతాయి. హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి.
ఉద‌యాన్నే కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఉత్సాహం వ‌స్తుంది. చురుగ్గా ప‌నిచేస్తారు. బ‌ద్ద‌కం పోతుంది. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి.

ఉద‌యాన్నే కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఉత్సాహం వ‌స్తుంది. చురుగ్గా ప‌నిచేస్తారు. బ‌ద్ద‌కం పోతుంది. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి.
జుట్టు రాలే స‌మ‌స్య ఉన్న‌వారికి కుంకుమ పువ్వు మేలు చేస్తుంది. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తాయి. జుట్టు కుదుళ్ల‌ను దృఢంగా చేస్తాయి. దీంతో జుట్టు పెరుగుతుంది.

కుంకుమ పువ్వు నీళ్ల‌ను ఎలా చేయాలంటే..

5 నుంచి 7 కుంకుమ పువ్వు పోగుల‌ను తీసుకుని గోరు వెచ్చ‌ని నీటిలో 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. దీంతో కుంకుమ పువ్వు నీళ్లు త‌యార‌వుతాయి. వాటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఈ నీళ్ల‌ను తాగాలి.. అప్పుడే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే మార్కెట్లో కల్తీలు, నకీల హవా నడుస్తోంది. కుంకుమపువ్వు చాలా కాస్ట్‌ ఉంటుంది.. కల్తీలేనది మాత్రమే ఎంచుకోని వాడాలి.. తక్కువకు వస్తుది కదా అని ఏది పడితే అది వాడితే.. ఇంకా అనవసరమైన సమస్యలు వస్తాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.