పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును లీచీ ఫ్రూట్‌తో కరిగించేయండి..!

అన్నిరోగాలకు మూలం బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌.. ఇది బాడీలో ఎంత ఎక్కువగా ఉంటే అన్ని సమస్యలు వస్తాయి.. మనిషికి కొవ్వు ఉండాలి కానీ మంచిదై ఉండాలి.. పొట్ట దగ్గర, తొడల భాగాల్లో, చేతుల దగ్గర, గడ్డం కింద ఇలా

పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును లీచీ ఫ్రూట్‌తో కరిగించేయండి..!


అన్నిరోగాలకు మూలం బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌.. ఇది బాడీలో ఎంత ఎక్కువగా ఉంటే అన్ని సమస్యలు వస్తాయి.. మనిషికి కొవ్వు ఉండాలి కానీ మంచిదై ఉండాలి.. పొట్ట దగ్గర, తొడల భాగాల్లో, చేతుల దగ్గర, గడ్డం కింద ఇలా వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోయి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తగ్గించుకోకుండా.. కవర్‌ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి అదే మీరు చేసే మొదటి తప్పు. మీకు పొట్ట ఎక్కువగా ఉన్నా, పొట్టు చుట్టూ కొవ్వుగా ఉన్నా.. వెన్న కరిగించినట్లు కరిగించే ఒక ఫ్రూట్‌ ఉంది. ఇది తిన్నారంటే.. మీ పొట్ట దెబ్బకు తగ్గిపోతుంది. 
Lychee - Wikipedia
కొంత‌మంది స్త్రీలల్లో తొడ‌లు, పిరుదులు పెర‌గ‌డంతో పాటు పొట్ట భాగం కూడా పెరుగుతుంది. అధిక బ‌రువుతో బాధ‌ప‌డే వారిలో పొట్ట భాగం పెద్ద‌గా ఉంటుంది. మనిషి సన్నాగానే ఉంటారు.. కానీ పొట్ట మాత్రం చెరువుకట్ట అంత ఉంటుంది. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు పొట్ట త‌గ్గితే బాగుంటుంద‌ని అనుకుంటూ ఉంటారు. శ‌రీరంలో ఇత‌ర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కంటే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు మ‌న ఆరోగ్యానికి ఎక్కువ న‌ష్టాన్ని క‌లిగిస్తుంది. ఎందుకంటే పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు ఊపిరితిత్తుల మీద‌, డ‌యాఫ్రామ్ మీద‌, ప‌క్క‌టెముక‌ల మీద‌, కండ‌రాల మీద చెడు ఫ్ర‌భావాన్ని చూపిస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో శ‌క్తి త‌గ్గిపోవ‌డం, బ‌ద్ద‌కంగా ఉండడం, ఆయాసం రావ‌డం, గుర‌క రావ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలో మ‌న‌కు లిచీ ఫ్రూట్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.
లిచీ ఫ్రూట్ ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తుందని.. శాస్త్ర‌వేత్త‌లు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. లిచీ ఫ్రూట్‌లో ఉండే ఒలిగోన‌ల్ అనే మూల‌కం పొట్ట భాగంలో కొవ్వు క‌రిగేలా చేయ‌డంలో, ఆ భాగంలో కొవ్వు పేరుకుపోకుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంద‌ని నిపుణులు క‌నుగొన్నారు. ఈ లిచీ ఫ్రూట్ మ‌న‌కు ప్ర‌స్తుత కాలంలో విరివిరిగా ల‌భ్య‌మ‌వుతుంది. పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయిన వారు.. ఈ లిచీ ఫ్రూట్‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే ఈ ఫ్రూట్‌లో రూటిన్ అనే ఫైబ‌ర్ ఉంటుంది. ఇది మ‌నం తిన్న ఆహారంలో ఉండే కొవ్వు ప‌దార్థాల‌ను శ‌రీరం ఎక్కువ‌గా గ్ర‌హించ‌కుండా చేయ‌డంలో తోడ్ప‌డుతుంది. కాబ‌ట్టి పొట్ట భాగంలో కొవ్వు త‌గ్గాల‌నుకునే వారు, శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయి ఇబ్బందుల‌కు గురి అవుతున్న‌వారు లిచీ ఫ్రూట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.