బొడ్డులో ఈ నూనెలు వేస్తే 5 న‌మ్మ‌లేని అద్భుత‌మైన ఫ‌లితాలు..!!

వయసుమీద పడే కొద్ది అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిల్లో ముఖ్యంగా మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అడుగుతీసి అడుగువేయాలంటే నరకమే.. కూర్చోలేరు, లేవలేరు. కానీ ఆయుర్వేదం ద్వారా ఈ నొప్పులను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. Navel Oiling చేస్తే కీళ్ల నొప్పులు ఉండవు.

బొడ్డులో ఈ నూనెలు వేస్తే 5 న‌మ్మ‌లేని అద్భుత‌మైన ఫ‌లితాలు..!!
Navel Oiling


వయసుమీద పడే కొద్ది అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.వాటిల్లో ముఖ్యంగా మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అడుగుతీసి అడుగువేయాలంటే నరకమే.. కూర్చోలేరు, లేవలేరు. రోజువారి పనులు చేసుకోవడం కూడా కష్టంగా అవుతుంది. అయితే ఈ నొప్పిని తగ్గించుకోవడానిక మందులు, ఆపరేషన్లు ఉన్నాయి.. కానీ ఆయుర్వేదం ద్వారా ఈ నొప్పులను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. Navel Oiling చేస్తే కీళ్ల నొప్పులు ఉండవు. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ దీనివల్ల రిజల్ట్‌ ఉంటుందండీ..!
బొడ్డులో భిన్న ర‌కాల నూనెల‌ను వేసి మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల రోగాల‌ను న‌యం చేయ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు అంటున్నారు. ఆయుర్వేద ప్ర‌కారం.. నాభి అనేది చైత‌న్యం యొక్క ప్ర‌ధాన భాగం. అక్క‌డ చాలా శ‌క్తి ఉంటుంది. బొడ్డు మ‌న శ‌రీరంలో 72వేల సిర‌ల ద్వారా ప్ర‌తి అవ‌య‌వానికి అనుసంధాన‌మై ఉంటుందట...అందువ‌ల్ల బొడ్డులో నూనె వేసి చికిత్స చేస్తే నరాల చివ‌ర‌లు ఉత్తేజంగా మారుతాయి. దీంతో ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయి.

నాభి చికిత్స కోసం ఉపయోగించే నూనెలు..
నాభి చికిత్స కోసం ప‌లు ర‌కాల నూనెల‌ను ఉప‌యోగిస్తారు. వాటితో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. అందువ‌ల్ల ఏ నూనెను బొడ్డులో వేసి మ‌ర్ద‌నా చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..
ఆవ నూనె
ఆవ నూనెలో అల్లైల్ ఐసోథియోసైనేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోని కొన్ని నొప్పి గ్రాహకాలను డీసెన్సిటైజ్ చేస్తుంది. తద్వారా కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ నూనెలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA) కూడా ఉంటాయి. ఇవి మంటలు, వాపుల‌ను తగ్గిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి స‌మ‌స్య‌ల వ‌ల్ల కలిగే నొప్పిని తగ్గిస్తాయి.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌ను బొడ్డులో వేసి మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాక ఆలివ్ నూనెలో అధిక మొత్తంలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి.
నువ్వుల నూనె
నువ్వులలో అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ గింజ‌ల‌ను క్వీన్ ఆఫ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు...నాభిలో ఈ నూనెను ఉపయోగించినప్పుడు కీళ్ళు, కండరాలలో ఉండే దీర్ఘకాలిక నొప్పి త‌గ్గుతుంది. అనేక అధ్యయనాలలో నువ్వుల నూనె ఆస్టియో ఆర్థరైటిస్ ప్రభావాన్ని త‌గ్గిస్తుంద‌ని వెల్ల‌డించారు. అందువ‌ల్ల బొడ్డులో నువ్వుల నూనెను వేసి మ‌ర్ద‌నా చేస్తే కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.
ఆముదం
కీళ్ల నొప్పులతో సహా పలు అనారోగ్య సమస్యలను తగ్గించే శక్తి ఆముదానికి ఉంది. ఈ నూనెను బొడ్డులో వేసి మసాజ్ చేయడం వల్ల కీళ్ల నొప్పులు, నరాల మంట, గొంతు కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి.
బొడ్డులో నూనె వేసి మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. సంతాన లోపం మ‌హిళ‌ల‌కు ఆ స‌మ‌స్య తొల‌గిపోతుంది. మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో ఉండే నొప్పులు త‌గ్గుతాయి. ఇన్ఫెక్ష‌న్లు, మొటిమ‌లు, అధిక బ‌రువు, కీళ్ల నొప్పులు.. వంటి స‌మ‌స్య‌ల నుంచి బయటపడవచ్చు..
ఇలానే చేయండి..
నాభిలో మసాజ్ చేయడానికి 2-3 చుక్కల నూనెను మాత్రమే ఉపయోగించాలి. బొడ్డును చాలా గట్టిగా నొక్కవ‌ద్దు. నూనెను వేశాక సున్నితంగా మ‌సాజ్ చేయండి.. 10-15 నిమిషాల పాటు మ‌సాజ్ చేస్తే చాలు. వారంలో రెండు సార్లు ఇలా బొడ్డులో నూనె వేసి మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల పైన చెప్పిన సమస్యలన్నీ తగ్గుతాయి.
Source
Dr. Manthena Satyanarayana.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.