Asthma : కుంకుడు గింజలతో ఆస్తమాను శాశ్వతంగా నయం చేసుకోవచ్చు..!

Asthma వల్ల ఒక మనిషి ఎంత ఇబ్బంది పడతాడో మనకు బాగా తెలుసు. సడన్‌గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఊపిరి ఆడదు. ఇన్‌హెలర్‌తో ఊపిరి పీల్చుకోవాలి.

Asthma : కుంకుడు గింజలతో ఆస్తమాను శాశ్వతంగా నయం చేసుకోవచ్చు..!
benefits of soap nuts for asthma


Asthma వల్ల ఒక మనిషి ఎంత ఇబ్బంది పడతాడో మనకు బాగా తెలుసు.. సడన్‌గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఊపిరి ఆడదు.. ఇన్‌హెలర్‌తో ఊపిరి పీల్చుకోవాలి. ఇది పిల్ల‌లోనూ, పెద్ద‌వారిలోనూ క‌నిపిస్తుంది. అయితే ఇద్ద‌రిలోనూ కార‌ణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్ర‌ధాన ల‌క్ష‌ణం ఆయాసం ఎక్కువ‌గా రావ‌డం. ఈ వ్యాధి కార‌ణంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువ‌గా త‌యార‌య్యి ఊపిరిని అడ్డ‌కుంటాయి.

ఈ విధ‌మైన శ్వాస నాళాల సంకోచం వ‌ల్ల పిల్లి కూత‌లు, ఆయాసం, ఛాతి ప‌ట్టిన‌ట్టుగా ఉండ‌డం, ద‌గ్గు వ‌స్తాయి. శ్వాస నాళాల వ్యాకోచాన్ని క‌లిగించే మందులు సాధార‌ణంగా మంచి ఉప‌శ‌మనాన్ని క‌లిగిస్తాయి. కొంద‌రిలో ఈ వ్యాధి ప్రాణాంత‌కం కూడా కావ‌చ్చు. ఆస్త‌మా వ్యాధితో బాధ‌ప‌డే వారు ఇప్పటికే ఎన్నో మందులను వాడి అలిసిపోయి ఉంటారు.. ఈ ఆస్త‌మాను నివారించ‌డానికి కుంకుడు గింజల్లోని ప‌ప్పు అద్భుతుంగా ప‌ని చేస్తుందని కొంత మంది ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కుంకుడు గింజలతో బెటర్‌ రిజల్ట్..

ఉబ్బ‌సం వ్యాధితో బాధ‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. ఇలాంటి వారు కుంకుడు గింజ‌లోని ప‌ప్పును ప్ర‌తిరోజూ సేవిస్తూ ఉంటే ఉబ్బ‌సం త‌గ్గిపోతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వేస‌విలో కుంకుడు కాయ‌ల‌ను బాగా ఎండ‌బెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఈ కంకుడు కాయ‌ల్లోని గింజల్లోని ప‌ప్పును తిన‌డం వ‌ల్ల ఉబ్బ‌సం వ్యాధి నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని కొంత‌మంది వైద్య నిపుణులు వారి ప‌రిశోధ‌న‌ల ద్వారా నిర్ధారించారు. మీరు కుంకుడు గింజలను కొట్టేప్పుడు చూసే ఉంటారు.. పసుపు రంగులో ఉంటుంది. అది చేదుగా ఉండదు.. బానే ఉంటుంది.. తినొచ్చు. కుంకుడు గింజ‌ల్లోని ప‌ప్పులో ఉండే ఔష‌ధ గుణాలు ఉబ్బ‌సానికి కార‌ణ‌మ‌య్యే బ్యాక్టీరియాను చంపి ఉబ్బ‌సాన్ని త‌గ్గిస్తాయట.. 

ఆస్త‌మాను తగ్గిండంలో వెల్లుల్లి ర‌సం కూడా అద్భుతంగా పని చేస్తుంది. చ‌క్కెర‌కేళి అరటి పండులో కొంచెం గోమూత్రాన్ని క‌లుపుకుని తాగిన కూడా ఆస్త‌మా త‌గ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.