Tips for Healthy Hair : కేశ సంరక్షణలో ఉల్లి పాత్ర అమోఘం..
Tips for Healthy Hair : ఉల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు అయితే ముఖ్యంగా ఉల్లి కేశ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని చాలామందికి తెలియదు..

Tips for Healthy Hair : ఉల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు అయితే ముఖ్యంగా ఉల్లి కేశ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని చాలామందికి తెలియదు..
ఉల్లి కేశ సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.. జుట్టుకు సంబంధించి ఎలాంటి సమస్య అయినా ఇది నివారిస్తుంది.. ముఖ్యంగా ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది.. తలకు ఉల్లి రసాన్ని తరచూ రాయడం వల్ల రాలిపోయిన శిరోజాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలలో నిరూపితమైంది.. అలగే ఉల్లిలో ఉండే జింక్, సల్ఫర్, ఫోలిక్‌యాసిడ్, బి విటమిన్, పొటాషియం వంటి పోషకాలతో ఒత్తైన జుట్టును ఇస్తాయి అలాగే ఇందులో ఉండే కొన్ని పోషకాలు చుండ్రును నివారిస్తాయి.. అందుకే మన ఆయుర్వేదంలో సైతం ఉల్లిని జుట్టు ఎదుగుదలకు ఉపయోగించేవారు..
అందుకే తరచూ పులి రసాన్ని తలకు పట్టించాలి ముఖ్యంగా శిరోజాలకి మేలు చేసే పెరుగులో ఈ ఉల్లి రసాన్ని కలిపి తలుపు అప్లై చేసి కాసేపు ఉంచాక గోరువెచ్చ నీటితో తల స్నానం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.. ఇలా కాదు అనుకున్నవారు నేరుగా ఉల్లి రసాన్ని అయినా తలకి రాసుకోవచ్చు.. ఇలా ప్రతినిత్యం చేయటం వల్ల శిరోజాలు ఊడటం తగ్గుతుంది అంతేకాకుండా ఊడిపోయిన వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి తెల్ల వెంట్రుకలు కూడా వచ్చే అవకాశం తగ్గుతుందని తెలుస్తోంది..