చిటికెడు ఇంగువతో ఎన్ని ప్రయోజనాలో.. !

వంటల్లో రుచి కోసం ఉపయోగించే పదార్థాలలో Asafoetida కూడా ఒకటి ముఖ్యంగా పులిహార చారు కూరలు తాలింపు రోటి పచ్చడిలో ఇంగువ వేస్తే ఆ రుచే ఉంటుంది.. వంటలకు మాత్రమే కాకుండా సాంప్రదాయ వైద్యంలోను కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది..

చిటికెడు ఇంగువతో ఎన్ని ప్రయోజనాలో.. !
Benefits of Asafoetida


ఇంగువ భారతీయ వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యాలకు ఎప్పుడు ప్రత్యేక స్థానమే ఉంటుంది. ఇది వంటల్లో రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇందులో ముందు వరుసలో ఉంటుంది ఇంగువ దీనివల్ల వంటలు గుమగుమలాడటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.. 

వంటల్లో రుచి కోసం ఉపయోగించే పదార్థాలలో ఇంగువ కూడా ఒకటి ముఖ్యంగా పులిహార చారు కూరలు తాలింపు రోటి పచ్చడిలో ఇంగువ వేస్తే ఆ రుచే ఉంటుంది.. వంటలకు మాత్రమే కాకుండా సాంప్రదాయ వైద్యంలోను కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది..

అలాగే కొన్ని రకాల ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఇంగువను ఉపయోగిస్తారు.. దీనిలో కార్మినేటివ్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇంగువలో ఫైబర్‌, ప్రొటీన్స్ , కాల్షియం, ఫాస్పరస్, ఐరన్‌, కెరటిన్, బి - విటమిన్, వంటి పోషకాలూ ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. 

ఇంగువను తరచూ వాడటం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది.. అలాగే ఇంగువ జీర్ణ రసాలు ఉత్పత్తి అవడానికి తోడ్పడుతుంది. ఎంజైమ్‌ల చర్యను ప్రభావితం చేస్తుంది. ఇంగువ తీసుకుంటే.. అజీర్తి, కడుపులో మంట, ఉబ్బరం, పేగులో పురుగులు, అపానవాయువు వంటి కడుపు సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఇంగువను మజ్జిక లో కలుపుకొని తాగితే జీర్ణం వ్యవస్థ మెరుగుపడి ఆకలి లేకపోవడం అంటే సమస్యలు దూరం అవుతాయి.. అలాగే జలుబు దగ్గు ఆస్తమా వంటి వ్యాధులు ఉన్నవారు కూడా ఇంగువను తీసుకోవడం వల్ల వాటి నుంచి రిలీఫ్ వస్తుంది.. అలాగే చాలామందికి నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది ఇలాంటివారు తరచూ ఆహారంలో ఇంగువను ఉపయోగించడం వల్ల ఆ సమస్య నుంచి దూరం కావచ్చు.. అలాగే ఈ సమయంలో కప్పు మజ్జిగలో చిటికెడు ఇంగువ, మెంతుల పొడి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగటం వల్ల ఉపశమనం ఉంటుంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.