పర‌గ‌డుపునే వేయించిన శ‌న‌గ‌ల‌ను తింటే ఏంత మంచిదో..!!

ఇప్పుడు స్నాక్స్‌ అంటే.. టిఫెన్స్‌, బిస్కెట్లు, చాక్లెట్లు ఉన్నాయి కానీ..మన పెద్దోల్లు..సాయంత్రం అయితే.. సరదాగా వేయించిన శనగలను తింటూ కబుర్లు చెప్పుకునే వాళ్లు.. ఇవి ఉప్పఉప్పగా బాగుంటాయి. ఇప్పుడు అవే వేయించిన శనగలను మీరు ఉదయం పరగడుపున తిన్నారంటే..

పర‌గ‌డుపునే వేయించిన శ‌న‌గ‌ల‌ను తింటే ఏంత మంచిదో..!!
Benefits with fried chickpeas


chickpeas : ఇప్పుడు స్నాక్స్‌ అంటే.. టిఫెన్స్‌, బిస్కెట్లు, చాక్లెట్లు ఉన్నాయి కానీ..మన పెద్దోల్లు..సాయంత్రం అయితే.. సరదాగా వేయించిన శనగలను తింటూ కబుర్లు చెప్పుకునే వాళ్లు.. ఇవి ఉప్పఉప్పగా బాగుంటాయి. ఇప్పుడు అవే వేయించిన శనగలను మీరు ఉదయం పరగడుపున తిన్నారంటే..మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 

పర‌గ‌డుపునే వేయించిన శ‌న‌గ‌ల‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..

వేయించిన శ‌న‌గ‌ల్లో విట‌మిన్లు ఎ, బి, సి, డి, ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, మెగ్నిషియం, ఫైబ‌ర్‌, ఐర‌న్‌, ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి. శ‌రీరానికి పోష‌ణ‌, శ‌క్తి ల‌భిస్తాయి. వేయించిన శ‌న‌గ‌ల‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తింటే రోజు మొత్తానికి కావ‌ల్సిన శ‌క్తిని పొంద‌వచ్చు. దీంతో యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు.

వేయించిన శ‌న‌గ‌ల‌ను ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ముఖ్యంగా ఈ శ‌న‌గ‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది అజీర్ణం, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. అలాగే అధిక బ‌రువు ఉన్న‌వారికి మేలు చేస్తుంది. బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గేలా చేస్తుంది.

శ‌న‌గ‌ల్లో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి.

షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉన్న‌వారు శ‌న‌గ‌ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్రణలో ఉంటాయి.. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

రోజూ నీరసంగా ఉండేవారు, శ‌క్తి లేన‌ట్లు భావించేవారు, బాగా అల‌సిపోయే వారు.. ఉద‌యాన్నే శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌క్తి బాగా ల‌భిస్తుంది. దీంతో యాక్టివ్‌గా ఉంటూ చురుగ్గా ప‌నిచేస్తారు. ఎంత ప‌నిచేసినా అల‌సిపోరు.

శ‌న‌గ‌ల్లో ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌త స‌మ‌స్యను త‌గ్గిస్తుంది. రక్తం బాగా త‌యార‌య్యేలా చేస్తుంది. అలాగే వీటిలోని కాల్షియం ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. శనగలను తినండి.. మరీ పొద్దుపొద్దున్నే ఏం తింటాం అనుకునేవాళ్లు.. సాయంత్రం అయినా తినండి.. పోయేదేముంది.. తినడం ముఖ్యం..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.