Ayurvedham : గంగవావిలి ఆకును చూశారా..? ఆకుకూరల్లోనే నెంబర్‌ వన్‌ ఇది..!

Ayurvedham : ఆకుకూరలంటే పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర.. ఇవి మాత్రమే కాదు.. మీకు తెలియనివి చాలా ఉన్నాయి.. మనం చిన్నప్పటి నుంచి ఆ నాలుగు ఐదు ఆకుకూరలనే చూస్తుంటాం

Ayurvedham : గంగవావిలి ఆకును చూశారా..? ఆకుకూరల్లోనే నెంబర్‌ వన్‌ ఇది..!


Ayurvedham : ఆకుకూరలంటే పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర.. ఇవి మాత్రమే కాదు.. మీకు తెలియనివి చాలా ఉన్నాయి.. మనం చిన్నప్పటి నుంచి ఆ నాలుగు ఐదు ఆకుకూరలనే చూస్తుంటాం.. ఊర్లల్లో అయితే చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి. అందులో ఒకటి గంగ‌వాయిల కూర. చాలా మంది ఈ ఆకుకూర‌ను ఇష్టంగా వండుకుని తింటారు. పోష‌కాల గ‌నిగా ఈ ఆకుకూర‌ను చెప్ప‌వ‌చ్చు. దీనిని గంగ‌వావిలి ఆకు, గంగ బెల్లి ఆకు అని వివిధ ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఈరోజు మనం ఈ ఆకుకూర వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం..!

ఈ గంగ‌వావిలి ఆకు కూర ఎరుపు, తెలుపు రెండు రంగుల్లో ఉంటుంది. ఈ మొక్క ఆకులు చిన్న‌గా, ద‌ళ‌స‌రిగా ఉంటాయి. అలాగే దీనికి ప‌సుపు రంగులో చిన్న పూలు కూడా పూస్తాయి. గంగ‌వావిలి మొక్క ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ పెరుగుతుంది. ఈ ఆకుకూర కొద్దిగా పుల్ల‌టి రుచిని క‌లిగి ఉంటుంది. దీనితో ప‌ప్పు, కూర వంటి వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటారు.

ఏ ఆకుకూర‌లో లేన‌న్ని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఈ ఆకుకూర‌లో ఉన్నాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, ప‌క్ష‌వాతం, ఏ డీ హెచ్ డి, ఆటిజం వంటి స‌మ‌స్య‌ల‌ను నివారించే గుణాలు ఈ ఆకుకూర‌లో ఉన్నాయి. 

ఈ ఆకుకూర‌లో విట‌మిన్ ఎ, సి, ఇ ల‌తో పాటు, బి కాంప్లెక్స్ విట‌మిన్స్, పొటాషియం, క్యాల్షియం, మాంగ‌నీస్, కార్బోహైడ్రేట్స్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. 

ఈ ఆకుకూర‌లో క్యాల‌రీలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో గంగ‌వావిలి ఆకు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగ‌ప‌ర‌చ‌డంలో కూడా ఈ ఆకుకూర మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. 

ఈ ఆకుకూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఓర‌ల్ క్యావిటీ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణుల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

గంగ‌వావిలి ఆకుకూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం, జుట్టు అందంగా కాంతివంతంగా త‌యార‌వుతాయి. అలాగే దీనిని తీసుకోవ‌డం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. 

గంగ‌వావిలి ఆకుకూర‌ను వారానికి ఒక‌సారి తీసుకోవ‌డం వ‌ల్ల నాడీ వ్య‌వ‌స్థ ప‌నితీరు కూడా మెరుగుప‌డుతుంది. జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. 

మాంసాహారం తిన‌ని వారు ఈ ఆకుకూర‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. 

దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ముడ‌త‌లు రాకుండా ఉంటాయి. 

కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. 

శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. 

ఈ విధంగా గంగ‌వావిలి ఆకుకూర మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని త‌ప్ప‌కుండా వారానికి ఒక‌సారైనా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.