Tulsi tea : దైవానికే కాదు దేహానికి హితం తులసి.. తులసి టీతో లాభాలెన్నో..

Tulsi : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండే Tulsi ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతిరోజు Tulsi కి పూజ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఇంటిలో ఎలాంటి కష్టాలు దరి చేరవని నమ్ముతారు.

Tulsi tea : దైవానికే కాదు దేహానికి హితం తులసి.. తులసి టీతో లాభాలెన్నో..
Benefits with Tulsi tea


Tulsi : సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండే Tulsi ను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతిరోజు Tulsi కి పూజ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఇంటిలో ఎలాంటి కష్టాలు దరి చేరవని నమ్ముతారు. అంతేకాకుండా తులసికి చుట్టూ ఉండే చెడు శక్తిని తనలోకి లాక్కొనే సామర్థ్యం ఉంటుందని అందుకే ఇంటిలోకి ఎలాంటి చెడు శక్తులు దరి చేరవని పురాతన కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. తులసి మొక్క నుంచి విడుదలైన గాలి సైతం మనసుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుందని తెలిసిందే. అయితే వీటన్నిటితో పాటు తులసి టీను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.

తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మనసుకి స్వాంతన ఇచ్చి ప్రశాంతత వాతావరణాన్ని ఇవ్వగలిగే శక్తి కలిగిన మొక్క తులసి. ఇందులో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే రోజు తులసి టీను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దరిచేరవని తెలుస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో, చలి కాలంలో ముక్కు, గొంతుకు సంబంధించిన పలు రకాల సమస్యలను తీర్చడంలో తులసి ముందుంటుందని తెలుస్తోంది.


బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటివి ఎలా తీసుకుంటారో అలాగే తులసిని కూడా తీసుకోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా గొంతుకు సంబంధించి ఎలాంటి సమస్యలైనా తులసి టీతో తగ్గిపోతాయని తెలుస్తోంది. ఆపకుండా దగ్గు ఇబ్బంది పెడుతుంటే ఉదయాన్నే తులసి టీ ను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కడుపులో ఎలాంటి సమస్యలు తలెత్తినా వాటిని నివారించడంలో ముందుంటుంది. చర్మంపై వచ్చే పలు రకాల ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ కాన్సర్ ను సైతం దూరం చేయటంలో తులసి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఓవరీ క్యాన్సర్ని దూరం చేయడంలో ముందుంటుంది.

తులసి టీతో పాటు గ్రీన్ టీను కూడా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని తెలుస్తోంది. రోజు ఈ టీ ను తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే వ్యాధి దూరమవుతుందని కొలెస్ట్రాల్ తగ్గుతుందని తెలుస్తోంది. వృద్ధాప్య లక్షణాలను సైతం దూరం చేయడంలో తులసి టీ ముందు ఉంటుంది. అయితే తులసిని అతిగా తీసుకుంటే వేడి చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే వారానికి కనీసం రెండుసార్లు తులసి టీను ఉదయాన్నే తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఏ విషయాన్నైనా అతి కాకుండా అదుపులో ఉంచితే అన్ని సమస్యలు దూరంగానే ఉంటాయని తెలుస్తోంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.