కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే జుట్టు పెరుగుదలను ఎవరూ ఆపలేరు..!

కొబ్బరి నూనె.. ఎన్నో ఏళ్ల నుంచి భారత దేశంలో అందంలో ఈ కొబ్బరినూనెను ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది స్వచ్ఛమైన కొబ్బరి నూనె వల్ల జుట్టు మంచిగా పెరుగుతుంది అయితే కొబ్బరి నూనెలో ఒక పదార్థాన్ని కలిపి రాయడం వల్ల జుట్టు పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అంటే కర్పూరం. కొబ్బరి నూనెలో

కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే జుట్టు పెరుగుదలను ఎవరూ ఆపలేరు..!


కొబ్బరి నూనె.. ఎన్నో ఏళ్ల నుంచి భారత దేశంలో అందంలో ఈ కొబ్బరినూనెను ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది స్వచ్ఛమైన కొబ్బరి నూనె వల్ల జుట్టు మంచిగా పెరుగుతుంది అయితే కొబ్బరి నూనెలో ఒక పదార్థాన్ని కలిపి రాయడం వల్ల జుట్టు పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అంటే కర్పూరం. కొబ్బరి నూనెలో కేవలం స్వచ్ఛమైన కర్పూరాన్ని మాత్రమే కలిపి రాయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ కర్పూరాన్ని ఎన్నుకోవడంలో ఏకాగ్రత చూపించడం అత్యవసరం బయట దొరికే కల్తీ కర్పూరాన్ని ఉపయోగించడం వల్ల చెడు ప్రభావం కూడా కలుగుతుంది అయితే కర్పూరం కొబ్బరి నూనెతో గల రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే.. 
జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టి, తిరిగి జుట్టు పెరుగుదలలో సహాయం చేసే  గుడ్డు | How To Use Egg To Prevent Hair Loss And Boost Hair Growth - Telugu  BoldSky
కొబ్బరి నూనె, కర్పూరం ఈ కలయిక శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రుకు కారణమయ్యే స్కాల్ప్ ఫంగస్, బ్యాక్టీరియా, దురద, అలర్జీలు మొదలైన వాటిని తొలగిస్తుంది. అందుకే ఇలా చేయడం వల్ల ఎంత చుండు సమస్య అయినా దూరం అవుతుంది.
కొబ్బరి నూనె, కర్పూరం కలయిక తల పేనును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. కర్పూరంలోని యాంటీపరాసిటిక్ లక్షణాలు పేనులను చంపుతాయి. రెండు చెంచాల కొబ్బరినూనె, ఒక చెంచా కర్పూరం పొడి కలిపి పేస్ట్‌లా చేసి తలకు, తలకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు కడిగేయాలి.
జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో చుండ్రు ఒకటి. కొబ్బరినూనె, కర్పూరం మిశ్రమం చుండ్రుతో బాధపడేవారికి చాలా మేలు చేస్తుంది. ఇది చుండ్రును పోగొట్టడమే కాకుండా జుట్టును బలపరుస్తుంది.
కర్పూరం, కొబ్బరి నూనె జుట్టు పెరుగుదల లోపాన్ని నయం చేస్తాయి. ఇది పొడవాటి, మందపాటి జుట్టును పొందడానికి మీకు సహాయపడుతుంది. కర్పూరం, కొబ్బరి నూనె తెల్ల జుట్టును నిరోధించడానికి, సహజంగా జుట్టు నల్లగా మారడానికి సహాయపడతాయి.
జుట్టు మెరుపును పెంచడానికి, పొడి, చిట్లిన జుట్టు సమస్యను తొలగించడానికి ఈ కలయిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీకు సహజంగా మృదువైన, మెరిసే జుట్టును అందిస్తుంది.
కొబ్బరి నూనెలో కర్పూరాన్ని కలిపి తలకు పట్టించి దాదాపు ఒక నాలుగు గంటలు ఉంచిన తర్వాత తలస్నానం చేసేయాలి దీని వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.