అధిక బరువుతో స్నాక్స్ తినటానికి భయపడుతున్నారా.. ఈ స్నాక్స్ తో తేలిగ్గా బరువు తగ్గేయండి..!
ఇంటిలో ఖాళీగా ఉన్నప్పుడు, ఏదో ఒక పని చేస్తున్నప్పుడు, ముఖ్యంగా సాయంకాలంలో స్నాక్స్ తినాలని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏమాత్రం బరువు పెరుగుతున్నాం అనే ఆలోచన ఉన్న వెంటనే నోటిని

ఇంటిలో ఖాళీగా ఉన్నప్పుడు, ఏదో ఒక పని చేస్తున్నప్పుడు, ముఖ్యంగా సాయంకాలంలో స్నాక్స్ తినాలని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏమాత్రం బరువు పెరుగుతున్నాం అనే ఆలోచన ఉన్న వెంటనే నోటిని అదుపులో పెట్టేసుకుంటారు కొందరు. అయితే ఎలాంటి అభ్యంతరం లేకుండా అందరూ హాయిగా తినే కొన్ని స్నాక్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
పాప్ కార్న్..
ఏ వయసు వారైనా ఇష్టంగా తినే పాప్కార్న్ తింటే బరువు పెరుగుతారని భ్రమ ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిలో ఎక్కువగా ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాకుండా బరువు పెరగడంలో ఏమాత్రం పాత్ర పోషించదు. అందుకే ఆకలి వేసినప్పుడు హాయిగా ఈ స్నాక్స్ లాగిన్ చేయొచ్చు. అయితే వీటిని తయారు చేసినప్పుడు మాత్రం తక్కువ నూనెను ఉపయోగించడం మర్చిపోకూడదు. అలాగే బయట దొరికే వాటిని తెచ్చుకోకుండా ఇంట్లోనే హాయిగా తయారు చేసుకొని తినడం మేలు..
ఓట్ మీల్..
ప్రతిరోజు ఈ ఓట్ మీల్ తీసుకోవడం వల్ల ఎలాంటి బరువు పెరగరు.. ఆకలి వేసినప్పుడు హాయిగా వీటిని తినేయొచ్చు. శరీరానికి కావలసిన పోషకాలు అందడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది..
డ్రై ఫ్రూట్స్..
డ్రై ఫ్రూట్ సాయంకాలం సమయంలో తింటే శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి అని చెబుతూ ఉంటారు నిపునులు. రోజు ఉదయాన్నే కొన్ని బాదం, అంజీర, కిస్మిస్ వంటి వాటిని నానబెట్టి సాయంకాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఐరన్ పుష్కలంగా అందుతాయి. బరువు పెరిగే వారికి ఇది ఎలాంటి సమస్య కాదు.
సీజనల్ ఫ్రూట్స్..
కొంతమంది ఫ్రూట్స్ పైరెత్తగానే మొహం చిట్లిస్తూ ఉంటారు. కానీ ఇవి శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, పోషకాలని పుష్కలంగా అందించడమే కాకుండా బరువును సైతం అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా ఈ విటమిన్ అధికంగా ఉండే ఉసిరి, దానిమ్మ, బత్తాయి, తీసుకోవడం వల్ల శరీరంలో అదనంగా పేర్కొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.