శరీరంలో సవాలక్ష సమస్యలకు మన ఆహారమే శత్రువు, మిత్రువు
కొందరు ఏం తినకపోయినా లావైపోతూ ఉంటారు. కొంతమంది ఎంతతిన్నా కర్ర శరీరంలా అలానే ఉంటుంది. అరె నేను కొంచెం తిన్నా లావుగా కనిపిస్తున్నానే....అని మథనపడేవారు చాలా మంది ఉన్నారు. బరువు పెరిగిపోతున్నామనే ఆత్మన్యూనత భావానికి లోనయ్యేవారు లేకపోలేదు. మానసిక క్షోభకు గురైపోతూ ఉంటాం. దానివల్ల ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంది.కాబట్టి సమస్య వస్తే పరిష్కారానికి

కొందరు ఏం తినకపోయినా లావైపోతూ ఉంటారు. కొంతమంది ఎంతతిన్నా కర్ర శరీరంలా అలానే ఉంటుంది. అరె నేను కొంచెం తిన్నా లావుగా కనిపిస్తున్నానే....అని మథనపడేవారు చాలా మంది ఉన్నారు. బరువు పెరిగిపోతున్నామనే ఆత్మన్యూనత భావానికి లోనయ్యేవారు లేకపోలేదు. మానసిక క్షోభకు గురైపోతూ ఉంటాం. దానివల్ల ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంది.కాబట్టి సమస్య వస్తే పరిష్కారానికి ఆలోచించాలే తప్ప......ఆందోళన చెందకూడదు. ఈరోజుల్లో ప్రతి దానికి సొల్యూషన్ ఉండనే ఉంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి దానికి తగ్గ మార్గాలు ఉంటాయి.
ఇప్పుడున్న పరిస్థితులో కొంతమంది సులువుగా బరువు పెరిగిపోతున్నారు. ఆరోగ్యకరమైన బరువైతే పరవాలేదు. ఆందోళనలు, అతి ఆహారం, ఆరోగ్య సమస్యలు వల్ల త్వరగా పెరిగిపోతుంటారు. శరీరం ఉబ్బిపోయినట్లు కనిపిస్తారు. కొన్నిసార్లు శరీరంలో నీరు పట్టడం వల్ల కూడా ఉబ్బినట్లు కనిపించే అవకాశం ఉంది.
కొంతమంది బాధొచ్చినా, సంతోషం వచ్చినా అతిగా తినేస్తారు. అది ఇంకా ప్రమాదం. ఇంకొందరు ఉదయం తినట్లేదు కదా అని మధ్యాహ్నం ఎక్కువ తినేస్తారు. మరికొంతమంది ఇష్టమైన ఆహారం కనిపిస్తే లాగించేస్తారు. అది మరీ డేంజర్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఏ చిన్న పొరపాటు చేసినా దాని ఫలితం కచ్చితంగా మన శరీరంపైనా, మన ఆరోగ్యంపైన పడుతుంది.
ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో లెక్కపెట్టుకుని మరీ తినాలని కాదు. పరిధిలో ఉండాలి. ఇష్టమనిపిస్తే కాస్త చూసుకుని తినాలి. జిహ్వచాపల్యాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. దానివల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే మన శరీరంలో సవాలక్ష సమస్యలకు మన తిండే పెద్ద శత్రువు. మిత్రువు. ఆరోగ్యంగా మలచుకుంటే మిత్రువు. పెడచెవిన పెడితే శత్రువు. అందుకే అంటారు మన ఆరోగ్యం మన చేతుల్లో అని.
కాబట్టి తినే తిండి బట్టి కూడా సులువుగా పెరిగే అవకాశముంది. దానికి తగ్గట్లుగా ఆహారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే వైద్యుల్ని సంప్రదించి డైట్ ప్లాన్ చేసుకుంటే మరి మంచిది. బరువు పెరుగుతున్నామని భయపడకండి. మార్గాలను వెతకండి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే....అన్ని సమస్యలు ఇట్టే తీరిపోతాయి.