Bitter gourd : రక్తంలో తీపిని తగ్గించే కాకరకాయ..

Bitter gourd ను తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా ఆకలిని పుట్టించి కడుపులో ఉన్న పురుగుల్ని మాయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

Bitter gourd : రక్తంలో తీపిని తగ్గించే కాకరకాయ..
Benefits of bitter gourd


Bitter gourd : రుచికి చేదుగా ఉన్నప్పటికీ పచ్చి కాకరకాయలు అద్భుతమైన ఆహారం. ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన ఔషధాల్లో ఒకటి కాకరకాయ. రక్తంలో అధికంగా ఉన్న చక్కెర స్థాయిలను ఎలాంటి మందులు అవసరం లేకుండా తగ్గించగలే శక్తి కాకరకాయకు ఉంది.

కాకరకాయను తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో రకాల వ్యాధులు నయమవుతాయి. ముఖ్యంగా ఆకలిని పుట్టించి కడుపులో ఉన్న పురుగుల్ని మాయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

ప్రపంచ దేశాల్లో ఇప్పటికే కాకరకాయను పలు వ్యాధులు నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. దీనిపై జరుగుతున్న పరిశోధనలు షుగర్ వ్యాధిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా వ్యాధినిరోధక శక్తిని సైతం పెంచుతుంది. రోజు ఉదయాన్నే కాకరకాయ రసం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 

కాకరకాయలో చాలామంది బెల్లం, చింతపండు వేసి వండుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అజీర్ణం సమస్య తగ్గి ఆకలి పెరుగుతుంది. వికారాన్ని తగ్గిస్తుంది. వాంతులు అవ్వకుండా కాపాడుతుంది. అలాగే కడుపుబ్బరంగా ఉన్నవారికి ఈ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది. అలాగే అల్లం, కొత్తిమీరతో కలిపి కాకరకాయను వండటం వల్ల కడుపులో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కాకరకాయ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఎ, రైబోఫ్లెవెన్ విటమిన్ సి ఐరన్ వంటివి శరీరాన్ని పలు సమస్యల నుంచి కాపాడుతాయి. సోరియాసిస్ వంటి చర్మవ్యాధులు ఉన్నవారికి సైతం కాకరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది.

కాకరకాయను తరచు తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా సాగుతుంది. శరీరంలో ఉన్న కొవ్వు కరిగి నాజూగ్గా తయారవుతారు. రక్తపోటును సైతం తగ్గించడంలో కాకర ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాకరకాయ ఉల్లిపాయతో కలిపి తీసుకోవడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి.. కాకరకాయ ఫైల్స్ వంటి సమస్యలను సైతం తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

మద్యం తాగే అలవాటు ఉన్నవారికి కాకర ఆకుల రసాన్ని రోజు ఇవ్వడం వల్ల మద్యం తాగినప్పుడు శరీరంలో వ్యతిరేకత ఏర్పడుతుంది. దీని వలన ఆ అలవాటును మానుకోవడమే కాకుండా మద్యం సేవించడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల సైతం దూరం అవుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.