Bladder Cancer : యూరిన్ రంగు మారిందా..? బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త..!

Bladder Cancer : యూరిన్ రంగుని బట్టి మనం ఆరోగ్యం ఎలా ఉంది అనేది చెప్పొచ్చు చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో మూత్రాశయ క్యాన్సర్ కూడా ఒకటి. అయితే ఈ క్యాన్సర్ ని మనం యూరిన్ రంగును బట్టి..

Bladder Cancer : యూరిన్ రంగు మారిందా..? బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు జాగ్రత్త..!


Bladder Cancer : యూరిన్ రంగుని బట్టి మనం ఆరోగ్యం ఎలా ఉంది అనేది చెప్పొచ్చు చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో మూత్రాశయ క్యాన్సర్ కూడా ఒకటి. అయితే ఈ క్యాన్సర్ ని మనం యూరిన్ రంగును బట్టి గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మహిళల కంటే పురుషులకి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. మొదటి దశలో కనుక ఈ క్యాన్సర్ ని గుర్తించి చికిత్స పొందుతే బయటపడచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మూత్రాశయ క్యాన్సర్ గురించి చాలా మందికి తెలియదు మరి ఈ క్యాన్సర్ కి సంబంధించి ముఖ్య విషయాలను ఇప్పుడు చూద్దాం.

మూత్రాశయ క్యాన్సర్ లో రకాలు:

యూరోథెలియల్‌ కార్సినోమా స్క్వామస్ సెల్‌ కార్సిమోనా అడెనోకార్సినోమా

మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు:

మూత్రంలో రక్తం మూత్రవిసర్జన మార్పు మూత్రవిసర్జన సమయంలో నొప్పి కలగడం బ్యాక్ పెయిన్ అలసట పొత్తికడుపు భాగంలో నొప్పి సడెన్ గా బరువు తగ్గడం

మూత్రాశయ క్యాన్సర్ రావడానికి గల కారణం..?

స్మోకింగ్ చేయడం వలన ఈ సమస్య కలగొచ్చు. కొన్ని రసాయనాల వలన రావచ్చు. రబ్బర్, లెదర్, డైస్, టెక్స్‌టైల్స్ వంటి వాటిలో వుండే ఈ రసాయనాల వలన సమస్య వచ్చే అవకాశం వుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉంటే కూడా వచ్చే అవకాశం వుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ తరచూ రావడం వలన కూడా ఇది వస్తుంది.

ఈ లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి:

మూత్రం రంగు మారితే డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యండి. మూత్రం నుండి రక్తం వచ్చినా సరే డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.