Calcium : కాల్షియం కావాలంటే పాలే తాగనక్కర్లేదు.. ఇవి కూడా తినొచ్చు..!

calcium : పాలు చాలామంది ఇదే అనుకుంటారు.. పాలు తాగితే బాడికి సరిపడా కాల్షియం వస్తుంది అని.. నిజానికి పాలల్లో  calcium కంటెంట్‌ తక్కువ ఉంటుంది..  calcium లోపం ఉంటే పాలే తాగక్కర్లేదు..

Calcium : కాల్షియం కావాలంటే పాలే తాగనక్కర్లేదు.. ఇవి కూడా తినొచ్చు..!
High calcium food


 calcium : పాలు...చాలామంది ఇదే అనుకుంటారు.. పాలు తాగితే బాడికి సరిపడా కాల్షియం వస్తుంది అని.. నిజానికి పాలల్లో  calcium కంటెంట్‌ తక్కువ ఉంటుంది..  calcium లోపం ఉంటే పాలే తాగక్కర్లేదు.. ఆల్టర్‌నేటివ్స్‌ చాలా ఉన్నాయి. మీకు పాలు ఇష్టం లేకపోతే.. వీటిని ట్రే చేయండి. లోపాన్ని భర్తీ చేయండి.. ఆగండాగండి.. అసలు కాల్షియం ఎందుకు కావాలి..? కాల్షియం విట‌మిన్ డి స‌హాయంతో ఎముక‌ల‌ను దృఢంగా మార్చుతుంది. దంతాల‌ను దృఢంగా ఉంచుతుంది.
అంజీర్ పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియంతోపాటు ఫైబర్స్, ఐరన్ కూడా ఈ పండులో సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. రాత్రి సమయంలో రెండు అంజీర్‌లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన అంజీర్ ల‌ని నీటితో సహా తినాలి. ఇలా అంజీర్‌ల‌ను తినటం వలన కాల్షియం లోపం తగ్గటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఉండదు. దీంతో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.
కాల్షియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల విష‌యానికి వ‌స్తే.. తోటకూరలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ప్రస్తుతం ఆకుకూరలు చాలా విరివిగా లభిస్తున్నాయి. ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి తోట‌కూర‌ అద్భుతంగా పనిచేస్తుంది. వారంలో రెండు సార్లు తోటకూరను ఆహారంలో భాగంగా చేసుకోండి. ఎముకల నిర్మాణానికి, అభివృద్ధికి కాల్షియం చాలా ముఖ్యమైనది.

నువ్వుల్లో అయితే కాల్షియం ఘోరంగా ఉంటుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతి రోజూ ఒక టీస్పూన్ నువ్వులను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. నువ్వులు, బెల్లం కలిపి కూడా తీసుకోవచ్చు. నువ్వులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినవచ్చు. దీంతో కాల్షియం పుష్క‌లంగా ల‌భిస్తుంది.
ఓట్స్ లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఓట్స్‌ని వారంలో రెండు సార్లు తీసుకుంటే చాలు.. ఓట్స్‌లో కాల్షియం, ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. క‌నుక వీటిని తీసుకుంటే కాల్షియం లోపం తగ్గడ‌మే కాకుండా అధిక బరువు సమస్య నుంచి కూడా బయట పడవచ్చు.
కాల్షియం లోపం ఉంటే.. వీటిని ట్రే చేయండి.. లోపం లేకున్నా.. పైన చెప్పినవి తరచూ తింటుంటే.. ఆరోగ్యంగా అందంగా ఉండొచ్చు..!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.