20 ఏళ్లు దాటకుండానే జుట్టు తెల్లబడిపోయిందా.. ఎంత ఆలోచించినా సమస్య ఎక్కడుందో అర్థం కావడం లేదా.. ఇదే కారణం కావచ్చు!

White hair: ఈరోజుల్లో చాలామందికి జుట్టుకు సంబంధించిన పదిరకాల సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విపరీతంగా జుట్టు ఊడిపోవడంతో పాటు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం మరో పెద్ద సమస్యగా మారుతుంది.

20 ఏళ్లు దాటకుండానే జుట్టు తెల్లబడిపోయిందా.. ఎంత ఆలోచించినా సమస్య ఎక్కడుందో అర్థం కావడం లేదా.. ఇదే కారణం కావచ్చు!
White hair


ఈరోజుల్లో చాలామందికి జుట్టుకు సంబంధించిన పదిరకాల సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విపరీతంగా జుట్టు ఊడిపోవడంతో పాటు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోవడం మరో పెద్ద సమస్యగా మారుతుంది. టీనేజ్ పిల్లల్లో సైతం జుట్టు తెల్లబడిపోవడం ఆందోళన కలిగించే విషయమే. అయితే ఎందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

జుట్టు తెల్ల బడిపోవడానికి ఏ ఒక్క కారణము కాదు చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా..

1. కుటుంబంలో ఎవరికైనా అతి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడపోయే సమస్య ఉంటే ఇది వంశపారపర్యంగా సంక్రమిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరికైనా ఇలా జరిగితే ఖచ్చితంగా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది.

2. ఈ రోజుల్లో పుట్టిన దగ్గరనుంచి జుట్టుకి షాంపూను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా వారానికి కనీసం రెండుసార్లు అయినా షాంపుతో తలని రుద్దుకోవడం తప్పనిసరి. అయితే ఈ షాంపూలు వల్లే పలు రకాల సమస్యలు తలెత్తుతున్నాయి.

3. చాలామంది ఈ షాంపు ని నేరుగా తలకి రాసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల షాంపూలో ఉండే హానికరమైన కెమికల్స్ తల పైన ప్రభావం చూపిస్తాయి. దీని వలన జుట్టు ఊడిపోయే సమస్య ఉంటుంది.

4. కొంత నీటిని తీసుకొని అందులో షాంపూను కలిపి తలకి పట్టించాలి.

5. అలాగే చాలామంది స్నానం చేయడానికి ముందే అరగంట ముందు షాంపుని తలకి రాసుకొని అలా వదిలేస్తూ ఉంటారు. దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా జుట్టు తెల్లబడిపోతుంది.

6. తల స్నానం చేసే సమయంలో నీటిని ఎక్కువగా ఉపయోగించకపోవడం వల్ల షాంపూలో ఉండే కొన్ని కెమికల్స్ తలపైనే ఉండిపోతాయి ఇవి జుట్టు మధ్యలో ఉండి పోవడం వల్ల ఆ ప్రదేశంలో మాత్రం జుట్టు నెరసిపోయే అవకాశం కూడా ఉంటుంది.

7. తెలిసి తెలియక బయట కనిపించే ప్రతి విషయాన్ని జుట్టు పైన ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా జుట్టుకి అధిక గాడితో ఉన్న షాంపూలు ఆడకపోవడమే మంచిది.

8. నిమ్మకాయను నేరుగా తలకి తగిలించకూడదు. అలాగే తేనె, పుల్లటి పెరుగు సైతం తలకి ఉపయోగించడం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.