పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయిలకు, అబ్బాయిలకు ఉండే కారణాలు ఇవే..

పెళ్లి తర్వాత.. పిల్లలు కలగపోవడం అనేది చాలా టఫ్‌ స్విచ్చవేషన్. తప్పు అంతా అమ్మాయిదే అన్నట్లు చూస్తారు. పిల్లలు పుట్టడం లేదంటే.. సమస్య భార్య, భర్త ఇద్దరిలో ఉంటుంది.

పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయిలకు, అబ్బాయిలకు ఉండే కారణాలు ఇవే..
causes of infertility

పెళ్లి తర్వాత.. పిల్లలు కలగపోవడం అనేది చాలా టఫ్‌ స్విచ్చవేషన్.. మొదట్లో ఇది అంత ఇబ్బంది పెట్టదు కానీ.. రోజులు గడిచేకొద్ది.. పిల్లలు కలగపోతే.. అది ఇక ఇంటర్నేషనల్‌ ప్రాబ్లమ్‌ అయిపోతుంది. ముఖ్యంగా.. తప్పు అంతా అమ్మాయిదే అన్నట్లు చూస్తారు. పిల్లలు పుట్టడం లేదంటే.. సమస్య భార్య, భర్త ఇద్దరిలో ఉంటుంది. ముందు అసలు ఎవరి వల్ల ఇష్యూ ఉందో తెలుసుకోవాలి.. మనం ఈరోజు.. కొన్ని కామన్‌ కారణాలు చూద్దాం.. అమ్మాయిల్లో, అబ్బాయిల్లో ఉండే  (  causes of Infertility ) ఈ కారణాల వల్ల పిల్లలు కలగడం లేదని వైద్యులు చెబుతున్నారు.. అవేంటంటే..

పిల్లలు కలగకపోవడానికి స్త్రీలలో ఉండే కారణాలు ( Reasons for Infertility in Women

స్త్రీలలోనైతే హార్మోన్ల లోపం, థైరాయిడ్ సమస్య, పీసీఓడీ వంటి అనేక అంశాలు సంతానలేమికి కారణం అవుతాయి... పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సమస్యకి కారణం కావొచ్చు. అలాగే పురుషుల్లో సంతానలేమికి అనేక కారణాలు ఉన్నాయి. వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో మానసిక ఒత్తిడి వంటి సమస్యలు, పౌష్టికాహార లోపం, హార్మోన్ల అసమతుల్యతలు వంటివి సంతానలేమి సమస్యలకు దారితీస్తున్నాయి

​పురుషుల్లో వంధ్యత్వం కారణాలు ( Causes of infertility in men )

దంపతులకి చాలా రోజుల వరకు పిల్లలు కలగకపోతే.. స్త్రీ, పురుషులు ఇద్దరు సమాన పాత్ర పోషిస్తారు. ఫలదీకరణం సమస్య అనేది కేవలం స్త్రీలకూ సంభదించినదే కాదు, పురుషులలో కూడా ఇలాంటి అవకాశాలు సమానంగా ఉంటాయని ముందు మీరు గుర్తుంచుకోవాలి. ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెడ్ రిప్రొడక్షన్ ప్రకారం.. వంధ్యత్వం ప్రస్తుతం భారతీయ జనాభాలో 10 నుండి 14 శాతం మందిని ప్రభావితం చేస్తుందని తేలింది.. పురుషుల్లో కంటే మహిళల్లో వంధ్యత్వానికి రెండు శాతం ఎక్కువని వెల్లడించారు.

​పురుషుల్లో సమస్యకి కారణమేంటి?

పురుషుల వంధ్యత్వానికి కారణం తక్కువ స్పెర్మ్ కౌంట్, నెమ్మదిగా స్పెర్మ్ మోటిలిటీ, అసాధారణ పదనిర్మాణం, ఇతర కారణాలు కూడా ఉన్నాయని ఉన్నాయి.. బ్రీఫ్స్, టైట్ అండర్ వేర్ వేసుకుంటే వృషణాల చుట్టూ వేడిగా అవుతుంది. కాబట్టి సమస్య ఎక్కడ ఉందో ముందు తెలుసుకుని దానికి తగ్గట్టు చికిత్స ప్రారంభిస్తే ఫలితం ఉంటుంది.

పిల్లలు పుట్టకపోవడానికి అమ్మాయిలకు, అబ్బాయిలకు ఉండే కారణాలు

స్త్రీలలోనైతే హార్మోన్ల లోపం, థైరాయిడ్ సమస్య, పీసీఓడీ వంటి అనేక అంశాలు సంతానలేమికి కారణం అవుతాయి... పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సమస్యకి కారణం కావొచ్చు. అలాగే పురుషుల్లో సంతానలేమికి అనేక కారణాలు ఉన్నాయి. వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో మానసిక ఒత్తిడి వంటి సమస్యలు, పౌష్టికాహార లోపం, హార్మోన్ల అసమతుల్యతలు వంటివి సంతానలేమి సమస్యలకు దారితీస్తున్నాయి

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.