కాలేయం చెడిపోవడానికి కారణాలు

మానవదేహంలో Liver ముఖ్యమైన అవయవం. ఇది పొట్టకు కుడివైపున ఉంటుంది. జీర్ణప్రక్రియలో అతి ముఖ్యమైన అవయవం Liver. మనం తీసుకున్న ఆహారంలో చక్కెరను కాలేయం తనలో ఉంచుకుని శక్తిగా మారుస్తుంది.

కాలేయం చెడిపోవడానికి కారణాలు
Causes of liver damage


నేటి రోజుల్లో జీవనస్థితిగతులు మారి అన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. చిన్నపిల్లలకు కూడా  Diabetes, thyroid, obesity  దరి చేరుతున్నాయో liver వ్యాధులు సైతం అలానే చుట్టుముడుతున్నాయి.

 Liver కి సంబంధించి వ్యాధులతో మరణాల రేటు గణనీయంగానే ఉంది.

మానవదేహంలో కాలేయం ముఖ్యమైన అవయవం. ఇది పొట్టకు కుడివైపున ఉంటుంది. జీర్ణప్రక్రియలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. మనం తీసుకున్న ఆహారంలో చక్కెరను కాలేయం తనలో ఉంచుకుని శక్తిగా మారుస్తుంది. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా, శరీరానికి శక్తి లభించాలన్నా, మనలోని విష పదార్థాలు విసర్జించబడాలన్నా లివర్ సరైన రీతిలో పనిచేయాలి.

కానీ నేటి ఆధునిక సమాజంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి, లివర్ పాడవ్వడానికి కారణభూతమవుతున్నాయి.

 కాలేయ వ్యాధుల్లో ముఖ్యంగా కామెర్లు ప్రమాదకరమైన వ్యాధి, చివరకు లివర్ క్యాన్సర్ కూడా వస్తుంది. హెపటైటిస్ బి, సి, కూడా వచ్చే అవకాశం ఉంది. కాలేయానికి సంబంధించి వ్యాధులు వంశపారంపర్యంగానూ రావొచ్చు.

 

లివర్ నాశనమవ్వడానికి కారణాలెంటో చూద్దాం

  • చక్కెర మోతాదు ఎక్కువున్న తీపి పదార్థాలు అతిగా తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
  • మనం తీసుకునే ఆహారంలో చక్కెర శాతం ఎక్కువైతే లివర్ లో పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది.
  • కొవ్వు పేరుకుపోవడం వల్ల లివర్ పనితీరు మందగిస్తుంది.
  • శరీరంలో కొవ్వు పేరుకుపోతే ఫ్యాటీ లివర్ వ్యాధి కూడా అవకాశం లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
  • కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ అతిగా తీసుకోవడం వల్లనూ లివర్ చెడిపోతుంది.
  • అయోడిన్ ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒకలాంటి ద్రవాలు స్రవించడంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి.
  • స్థూలకాయం ఉన్నవారు కాలేయ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
  • ముఖ్యంగా మధ్యపానం, సిగరెట్ వాడిన వాళ్లలో కాలేయం త్వరగా చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి.
  • లైంగిక సంబంధం వల్లనూ కాలేయ వ్యాధులు వస్తాయి.
  • చిన్నచిన్న నొప్పులు, సమస్యలకే మనం మందులు వాడేస్తుంటాం. కానీ వాటి ప్రభావం లివర్ పై కచ్చితంగా చూపిస్తుంది. అతిగా ఉంటే సమస్యలు ఉంటే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకుంటే మంచిది.
  • ఉదయం అల్పాహారం మరిచినా లివర్ పై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవాలి. మలం సరిగ్గా రాకపోయినా, 2 రోజులకొకసారి వెళ్లినా కాలేయంలో వ్యర్థాలు పేరుకుపోయి ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తాయి.

 

కాలేయ వ్యాధి లక్షణాలు

  • మూత్రం ముదురు రంగులో ఉండటం
  • కామెర్లు
  • మలం రంగు మారడం
  • వికారం, అతిసారం
  • కడుపునొప్పి
  • అల్సర్లు

 

ఒక వ్యాధి పెరిగాక వైద్యం చేయించడం కంటే ....ముందుగానే గ్రహిస్తే ఆరోగ్యాన్ని సులువుగా కాపాడుకోవచ్చు.

 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.