నాలుక పూత, నోటిలో పుండ్లు అజాగ్రత్త చేస్తే ప్రమాదంలో పడినట్టే..

నాలుక పూత కి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా శరీరంలో ఉండే అంతర్గత కారణాలు కొన్ని అయితే బయట ఉండే కారణాలు మరికొన్ని. ఈ రెండిటి వల్ల సమస్య కొన్నిసార్లు తీవ్రంగా మారుతుంది.

నాలుక పూత, నోటిలో పుండ్లు అజాగ్రత్త చేస్తే ప్రమాదంలో పడినట్టే..
Coated tongue and mouth sores


Coated tongue  చిన్నగా కనిపించినా ఎంతగానో ఇబ్బంది పెట్టే సమస్య. దీంతో ఏమీ తినలేరు నీరసపడిపోతూ ఉంటారు. నీళ్లు తాగినా నోరు కదిపినా నోరంతా మంటగా అనిపిస్తుంది. కొన్నిసార్లు పెదవుల పైన దవడలోని పుండ్లు ఏర్పడతాయి. నాలుక అంతా ఎర్రగా మారిపోయి నోటిలో నీటి పొక్కులు ఏర్పడతాయి. నొప్పితో నోరు తెరవడం సైతం కష్టంగా మారుతుంది. పులుపు, కారం వంటి పదార్థాలు అస్సలు తీసుకోలేరు. అందుకే ఈ నోటి పూతను కచ్చితంగా అదుపు చేసుకోవాలి..

ముఖ్యంగా నాలుకపూతకి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా శరీరంలో ఉండే అంతర్గత కారణాలు కొన్ని అయితే బయట ఉండే కారణాలు మరికొన్ని. ఈ రెండిటి వల్ల సమస్య కొన్నిసార్లు తీవ్రంగా మారుతుంది.

శరీరంలో జరిగే మార్పులు వల్ల వచ్చే నోటి పూత ముఖ్యంగా హార్మోన్ లో హెచ్చుతగ్గులు, వంశపారపర్యం, శరీరంలో అధిక వేడి ఉండటం ఆహారంలో బి 12, విటమిన్ సి, పోలిక్ యాసిడ్ తగ్గటం, రక్తహీనత వంటి కారణాలు కావచ్చు.

అలాగే మరికొన్నిసార్లు బయట కారణాల వల్ల వస్తుంది. పొగాకు తాగటం, మద్యం సేవించడం, పళ్లు శుభ్రంగా ఉంచుకోకపోవడం, శరీరానికి సరిపడిన ఆహారం తీసుకోకపోవడం, విపరీతంగా మానసిక ఒత్తిడికి గురవటం, పుల్లటి వస్తువులు అధికంగా తినటం, బుగ్గలు నాలుకలు కొనుక్కోవడం వంటివి నోటిపూతకు కారణం అవుతాయి.

అయితే తరచూ నోటి పూత వస్తూ ఉంటే మాత్రం ఎలాంటి అజాగ్రత్త చేయకూడదు. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే నాలుక పైన వైద్యులు సూచించిన మందులు రాసుకోవడం వంటివి చేయాలి.

ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు అంటే..

ఇంటిలోనే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం వల్ల నోటి పూతను దూరం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉసిరి పచ్చడిని నెయ్యి వేసుకొని తినటం, పాత నిమ్మకాయ పచ్చడిని తినడం వల్ల ఈ సమస్య అదుపులో ఉంటుంది.

  • కొబ్బరి పాలను నాలుకకి రాయడం వల్ల పుండ్లు తగ్గిపోతాయి.
  •  నువ్వుల నూనెను నోట్లో పోసుకొని పుక్కల్లించటం వల్ల ఈ సమస్య అదుపులో ఉంటుంది.
  • అలాగే చన్నీళ్లు వేడి నీళ్లను మార్చి మార్చి నోరును పుక్కలించాలి.
  • వేడి నీళ్లలో కొంచెం ఉప్పు వేసి రోజుకు నాలుగు సార్లు పుక్కలించటం వల్ల సమస్య అదుపులో ఉంటుంది.
  • అలాగే తమలపాకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో నోటిని పుక్కలిస్తే ప్రయోజనం ఉంటుంది.
  • విటమిన్ సి, విటమిన్ బి 12, బి కాంప్లెక్స్ వంటి మాత్రలు వాడటం వల్ల సైతం నోటిలో పుండ్లను అదుపులో ఉంచుకోవచ్చు..
  • అలాగే నువ్వులు, బొప్పాయిని నమ్మలటం వల్ల ఈ సమస్య అదుపులో ఉంటుంది.
  • ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కొబ్బరి పాలలో తేనె కలిపి నాలుగు పైన పండ్ల పైన రాస్తే ఉపశమనం ఉంటుంది.
  • అధికంగా మాంసాహారం, సిగరెట్టు వంటి వాటిని మానేయాలి.
  • అంజీర పండును నీళ్లలో నూరి దానిని కొండ్ల పైన రాస్తే వెంటనే తగ్గిపోతాయి.
  • ప్రతిరోజు కచ్చితంగా ఉప్పు నీటితో నోటిని కుక్కలు ఇస్తూ ఉండాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.