Coconut Oil : రాత్రి ఒక స్పూన్‌ కొబ్బరినూనె తాగితే.. బరువు తగ్గొచ్చు, షుగర్‌ కంట్రోల్‌ చేయొచ్చు

స్వచ్ఛమైన Coconut oil  అమ్మప్రేమతో సమానం.. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఇది జుట్టుకు అయినా, ఆరోగ్యానికి అయినా చాలా బాగా పనిచేస్తుంది. Coconut oil లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. కొబ్బ‌రినూనెతో కొన్ని ప్రాంతాల్లో వంట‌లు చేస్తుంటారు

Coconut Oil  : రాత్రి ఒక స్పూన్‌ కొబ్బరినూనె తాగితే.. బరువు తగ్గొచ్చు, షుగర్‌ కంట్రోల్‌ చేయొచ్చు
coconut oil for weight loss


స్వచ్ఛమైన కొబ్బరినూనె అమ్మప్రేమతో సమానం.. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఇది జుట్టుకు అయినా, ఆరోగ్యానికి అయినా చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బ‌రినూనెలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. కొబ్బ‌రినూనెతో కొన్ని ప్రాంతాల్లో వంట‌లు చేస్తుంటారు. దీంతో చేసే వంట‌కాల‌ను తిన‌లేని వారు నేరుగా ఈ నూనెను తీసుకోవ‌చ్చు. రోజూ రాత్రి పూట నిద్ర‌కు ముందు కేవ‌లం ఒక్క టీస్పూన్ కొబ్బ‌రినూనెను తీసుకున్నా చాలు.. అమోఘ‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బ‌రినూనెలో మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కొవ్వును క‌రిగేంచేందుకు స‌హాయ ప‌డ‌తాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ముఖ్యంగా పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది.

కొబ్బ‌రినూనె శ‌రీర మెట‌బాలిజంను పెంచుతుంది.. దీంతో శ‌ర‌రీంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. థైరాయిడ్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి కొబ్బ‌రినూనె మేలు చేస్తుంది. దీంతో హార్మోన్లు కూడా బ్యాలెన్స్ అవుతాయి. దీని వ‌ల్ల మ‌హిళ‌లకు కూడా ఎంతో ఉప‌యోగం ఉంటుంది. వారికి నెల‌స‌రి స‌రిగ్గా వ‌స్తుంది.

కొబ్బ‌రినూనెలో కాప్రిక్ యాసిడ్‌, లారిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి ఫంగ‌స్‌, ఈస్ట్ ఇన్‌ఫెక్ష‌న్ల‌పై ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల ఈ నూనెను తీసుకుంటే వివిధ ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. జ‌న‌నావ‌య‌వాల్లో వ‌చ్చే ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ఆ భాగం ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది.

కొబ్బ‌రినూనె తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. దీంతో ఇన్సులిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది.

కొబ్బ‌రినూనెను తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌ల ప్రమాదం తగ్గించుకోవచ్చు..గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ రాత్రి కొబ్బరినూనెను తీసుకుంటే మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే సుఖంగా విరేచ‌నం అవుతుంది. ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. జీర్ణాశ‌యం, పేగులు మొత్తం శుభ్రంగా మారుతాయి.

అయితే ఈ ప్రయోజనాలు అందిరికి ఒకలే ఉండాలని లేదు. కొంతమందికి కొబ్బరి నూనె పడదు.. తాగితే విరేచనాలు అవుతాయి. మీ బాడీ ముందు నుంచే సెన్సిటివ్‌.. ఏది పడితే అది తినలేరు అనుకుంటే.. ముందు కొంచెం ట్రై చేయండి.. విరేచనాలు, వాంతులు అవుతుంటే.. మీరు తాగకండి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.