Cracked feet : అందమైన పాదాలు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి..!
Cracked feet : అందమైన పాదాలు ఆరోగ్యానికి గుర్తు. పాదాలను చక్కగా ఉంచుకోవాలి. కొందరిలో పాదాలు, మడమలు పగుళ్లు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా పాదాల పగుళ్లు శరీరంలో రక్తం తక్కువ అవుతుందని చెప్పే హెచ్చరిక.

Cracked feet : అందమైన పాదాలు ఆరోగ్యానికి గుర్తు. పాదాలను చక్కగా ఉంచుకోవాలి. కొందరిలో పాదాలు, మడమలు పగుళ్లు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా పాదాల పగుళ్లు శరీరంలో రక్తం తక్కువ అవుతుందని చెప్పే హెచ్చరిక. చలికాలంలో ఈ సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. పాదాలు పగిలిపోవడం వల్ల ఎండిపోయి గరుగ్గా తయారవుతాయి. దీంతో చూడటానికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది.
సాధారణంగా పాదాలు పగిలిపోయినప్పుడు చెప్పులు వేసుకున్న సాక్సులు వేసుకున్న ఏం చేసినా ఈ పరిస్థితి మారదు. కాళ్లలో పగుళ్ళు మడమల చివర, వేళ్ళ మధ్య ఎక్కడైనా వస్తాయి. అయితే శరీరం స్వభావాన్ని బట్టి ఈ తీరు మారుతూ ఉంటుంది. అలాగే సున్నితత్వం కోల్పోయి దళసరిగా మారినప్పుడు పగళ్లు మరింతగా వేధించే అవకాశం ఉంది.
పాదాలు పగిలిపోవడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే..
- సాధారణంగా స్వభావారీత్యా కొందరు చర్మం పొడిబారి ఉంటుంది. ఇలాంటి వారికి ఎక్కువగా పాదాలు పగిలిపోయే అవకాశం ఉంటుంది.
- ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్ల కూడా ఇలా జరుగుతుంది.
- అధిక బరువు ఉన్నవారికి సైతం పాదాలు పగిలిపోయే అవకాశం ఉంది.
- సరైన చెప్పులు ఎంచుకోకపోవడం, నడక సమయంలో సరిగా ఉండకపోవడం వంటి వాటి వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి.
- షుగర్ వ్యాధి, టైఫాయిడ్, విపరీతంగా జ్వరం వస్తూ ఉండటం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
- వయసు పైపడుతున్న కొలది చర్మం ఎండిపోయి పాదాలు పగిలిపోయి అవకాశం ఉంది.
- పోషకాహారం లోపం వల్ల కూడా కొన్నిసార్లు ఈ పరిస్థితి ఏర్పడుతుంది
ఎలా తగ్గించుకోవాలంటే..
- శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు కూడా పాదాల పగిలిపోయే అవకాశం ఉంది. అందుకే చల్లని పదార్థాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
- ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి సమయంలో కాళ్ళకి చేతులకి నెలకు ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవడం అలవాటుగా మార్చుకోవాలి.
- రాత్రి పడుకునే సమయంలో వేడి నీళ్లతో కాళ్ళను కడిగి ఆ తర్వాత నువ్వుల నూనె లేదా ఆలివ్ ఆయిల్ తో సున్నితంగా మర్దన చేయాలి.
- గరుగ్గా ఉండే గచ్చు మీద పాదాలను రుద్ది పైన ఉండే పగుళ్లను తొలగించుకోవచ్చు.
- బాగా పండిన అరటిపండును పాదాల పగుళ్ల దగ్గర రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు పాలు, పెరుగు, మేకపాలు, చేప వంటివి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మాంసం, గుడ్లు, చిక్కుడు జాతి ఆహారం తీసుకోవాలి.