Brown rice tea : బ్రౌన్‌ రైస్‌ టీతో మధుమేహం కంట్రోల్లో ఉంటుంది తెలుసా..?

Diabetes ఉన్నవాళ్లు ముందు చేయాల్సి పని..తినే ఆహారం మార్చడం.. అప్పటి వరకూ తిన్న వైట్‌ రైస్‌ వారి శుత్రువు అయిపోతుంది. డయబెటీస్‌ ఉంటే వైట్‌ రైస్‌ తినకూడదని వైద్యులు చెప్తారు. దీంతో చాలామంది బ్రౌన్‌ రైస్‌, బ్లాక్‌ రైస్‌ లాంటివి తింటుంటారు.

Brown rice tea : బ్రౌన్‌ రైస్‌ టీతో మధుమేహం కంట్రోల్లో ఉంటుంది తెలుసా..?
control diabetes with brown rice tea


Diabetes ఉన్నవాళ్లు ముందు చేయాల్సి పని..తినే ఆహారం మార్చడం.. అప్పటి వరకూ తిన్న వైట్‌ రైస్‌ వారి శుత్రువు అయిపోతుంది. డయబెటీస్‌ ఉంటే వైట్‌ రైస్‌ తినకూడదని వైద్యులు చెప్తారు. దీంతో చాలామంది బ్రౌన్‌ రైస్‌, బ్లాక్‌ రైస్‌ లాంటివి తింటుంటారు. అది కూడా ఒక్క పూట మాత్రమే.. మధుమేహంతో పోరాడుతున్న వారిలో భారత్ రెండో స్థానంలో ఉంది. దాదాపు 6.51 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే రక్తంలో చక్కెర పరిమాణాలు అధుపులో ఉండడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది.  

బ్రౌన్ రైస్ టీలో లభించే పోషకాలు..

  • బ్రౌన్ రైస్ టీలో సెలీనియం అధిక పరిమాణంలో ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును నిర్వహించడానికి, హార్మోన్లు, జీవక్రియలను నియంత్రించడానికి సహాయపడుతుంది. 
  • బ్రౌన్ రైస్ టీలో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. 
  • అంతేకాకుండా నరాల పని తీరును కూడా మెరుగుపరుచుతుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి తప్పకుండా ఈ టీని తీసుకోవాల్సి ఉంటుంది. 
  • ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించడానికి సహాయపడుతుంది. 
  • ప్రతి రోజూ బ్రౌన్ రైస్ టీని తాగడం వల్ల శరీరానికి పొటాషియం, మాంగనీస్ కూడా లభిస్తాయి.

బ్రౌన్ రైస్ టీని ఇలా చేయండి..

ముందుగా ఒక పాన్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. బ్రౌన్ రైస్‌ను వేడి నీటిలో వేసి ఉడికించాలి. ఇప్పుడు ఆ నీటిలో అల్లం, బే ఆకు, ఎండుమిరియాలు వేసి ఉడికించాలి. వేసిన తర్వాత నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత అందులో బెల్లం వేసి, సర్వ్‌ చేసుకోవాలి. అంతే బ్రౌన్‌ రైస్‌ టీ రెడీ..!

బ్రౌన్ రైస్ టీ ప్రయోజనాలు..

  • బ్రౌన్ రైస్ టీ బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 
  • ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించుకోవచ్చు.
  • బ్రౌన్ రైస్ టీని ప్రతి రోజూ తాగడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ, స్ట్రెస్ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
  • ఇందులో పీచు పదార్థాలు కూడా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.