Indian snakeroot : ఆయుర్వేదంలో సర్పగంధ మొక్కకు గొప్ప స్థానం.. హైబీపీకి బెస్ట్‌ మెడిసిన్‌

Sarpagandha plant  : ఆయుర్వేదం మొక్కలు మూలికల మీదే ఎక్కువగా ఆధారపడింది.. వీటితోనే అంచుచిక్కని సమస్యలను సైతం అవలీలగా నయం చేసింది..స‌ర్ప‌గంధ చిన్నవైన పింక్‌, తెలుపు రంగు పువ్వులు పూస్తాయి.. ఈ మొక్క వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు .

Indian snakeroot : ఆయుర్వేదంలో సర్పగంధ మొక్కకు గొప్ప స్థానం.. హైబీపీకి బెస్ట్‌ మెడిసిన్‌
Cure High BP with sarpagandha plant


Sarpagandha plant  : ఆయుర్వేదం మొక్కలు మూలికల మీదే ఎక్కువగా ఆధారపడింది.. వీటితోనే అంచుచిక్కని సమస్యలను సైతం అవలీలగా నయం చేసింది.. ఇప్పుడు ఇంగ్లీష్‌ మందులు వచ్చాక ఆయుర్వేదం గురించి ఎక్కువగా పట్టింటుకోడం లేదు కానీ..ఒకప్పుడు ఆయుర్వేదానికి పెద్దపీఠ వేశారు. ఎన్నో వృక్షాల‌కు చెందిన భాగాల‌ను కూడా వైద్యంలో ఉప‌యోగిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కొన్ని మొక్క‌ల గురించి చాలా మందికి తెలియ‌దు. కానీ నిజానికి ఆ మొక్క‌ల వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు క‌లుగుతాయి. అనారోగ్యాల‌ను వాటితో న‌యం చేసుకోవచ్చు. అలాంటి మొక్క‌ల్లో స‌ర్ప‌గంధ ఒక‌టి. దీన్నే Indian snakeroot అంటారు. ఇది చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఆయుర్వేదంలో స‌ర్ప‌గంధ‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. ఈ మొక్క‌కు చెందిన వేళ్ల‌ను ప‌లు ర‌కాల వ్యాధుల‌ను నయం చేసేందుకు ఉప‌యోగిస్తారు.
స‌ర్ప‌గంధ చిన్నవైన పింక్‌, తెలుపు రంగు పువ్వులు పూస్తాయి.. ఈ మొక్క వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు .
స‌ర్ప‌గంధ హైబీపీని త‌గ్గించ‌డంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో రెసర్‌పైన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. అందువ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. స‌ర్ప‌గంధ వేళ్ల‌ను న‌మిలితే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. నిద్ర‌లేమి త‌గ్గుతుంది. రాత్రి చ‌క్క‌గా నిద్ర ప‌డుతుంది.

స్త్రీల‌కు నెల నెలా రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు స‌ర్ప‌గంధ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. 
ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను శుభ్రం చేస్తుంది. నెల‌స‌రి స‌రిగ్గా వ‌చ్చేలా చేస్తుంది. దీంతోపాటు మ‌ల‌బ‌ద్ద‌కం, విరేచ‌నాలు వంటివి త‌గ్గిపోతాయి.
సర్పగంధ వేరు విరేచనకారిగా, ఉష్ణజననిగా, మూత్రబంధ నివారిణిగా పనిచేస్తుంది. 
వీటికి మత్తు కలిగించే గుణం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. 
జ్వరం, గాయాలు, శూలనొప్పి, నిద్రలేమి, మూర్ఛ, తలతిరగడం, అజీర్తి వంటి వాధలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గర్భిణులు ప్రసవ సమయంలో ప్రసవం సులభంగా జరగడానికి దీనిని వాదాతారు.
దీని ఆకుల రసాన్ని సేవించడం వల్ల కళ్ల మసక దూరమౌతుంది.
సర్పగంధ వేర్ల పౌడర్ 1 గ్రాము గ్లాస్ మేకపాలలో పంచదారతో కలిపి తీసుకుంటే మానసిక స్థితి మామూలుగా వస్తుంది. మరీ పిచ్చిపట్టినట్లు ప్రవర్తించే వాళ్ళకు, హిస్టీరియాతో బాధపడే వాళ్ళకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.