Fenugreek : ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మెంతుల్ని మర్చిపోకండి.. అజీర్తి, మధుమేహం, విరేచనాలు, బరువు తగ్గించడం.. ఇలా ఎన్నో!

Fenugreek ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. వీటిని పోషకాల గనిగా పిలుస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి భారతదేశం వంటకాల్లో భాగం అయిపోయిన fenugreek తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

Fenugreek : ఏ ఆరోగ్య సమస్య వచ్చినా మెంతుల్ని మర్చిపోకండి.. అజీర్తి, మధుమేహం, విరేచనాలు, బరువు తగ్గించడం.. ఇలా ఎన్నో!
cure health problems with fenugreek


Fenugreek : ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. వీటిని పోషకాల గనిగా పిలుస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి భారతదేశం వంటకాల్లో భాగం అయిపోయిన మెంతులను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
మెంతులతో ఎన్నో రకాల ఆహారాలు తయారు చేసుకోవచ్చు. మెంతికూర పప్పు, మెంతాకు వడలు వంటివి చేసుకుంటూ ఉంటారు. అలాగే మెంతాకును వేయించి తీసుకున్న మంచిగానే ఉంటుంది. అయితే నిత్యజీవితంలో శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందించడంలో మరిన్ని వ్యాధులను నయం చేయటంలో మెంతులు ముందు ఉంటాయని తెలుస్తోంది
మెంతుల్లో ముఖ్యంగా జీర్ణశక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అందుకే ఆకలి వేయనివారు తరచూ మెంతులని తీసుకోవాలి. ఇది మలబద్ధకం సమస్యను సైతం నివారిస్తుంది. పేగుల్లో ఏవైనా సమస్యలు ఉంటే దూరం చేస్తుంది. వాటిలో పేరుకొని ఉన్న మలేనాలను బయటపరచి జీర్ణవాహికలను శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది.
మెంతికూర రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అధికంగా ఉన్న చెడు కొవ్వును తగ్గిస్తుంది.

తొందరగా బరువు తగ్గాలి అనుకునేవారు ఒక చెంచా మెంతులను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది.
ఆడవారిలో వచ్చే పలు రకాల సమస్యల్ని నివారించడంలో ఇది ముందుంటుంది. హార్మోన్ల హెచ్చుతగ్గుల్ని సవరిస్తుంది. స్త్రీలలో స్తనం వృద్ధికి సైతం మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి.
నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో మెంతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మెంతిపొడి అన్నంలో కలుపుకుని తినడం వల్ల ఈ సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.
మెంతులు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. మెంతుల్ని పొడిగా చేసి మధుమేహం సమస్య ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున ఒక చెంచా మెంతిపొడిని చప్పరించడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న చక్కెర స్థాయిలో తగ్గిపోతాయి.
విరోచనాలు ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక చెంచా మెంతులని ఒక కప్పు పెరుగులో కానీ మజ్జిగలో కానీ నానబెట్టి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
మెంతి పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరం అజీర్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
జలుబు చేసి గొంతులో కఫం ఏర్పడితే మెంతి పొడిని వేడి నీటిలో మరిగించి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
రోజు మెంతిపొడిని అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలుస్తోంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.