Human lifespan : టెక్నాలజీ పెరుగుతోందంటే... మనిషి ఆయుర్దాయం క్షీణించినట్ల

Human lifespan : టెక్నాలజీ పెరుగుతోంది. మనుషుల రోగాలు పెరుగుతున్నాయి. కారణం....సుఖవంతమైన జీవితం. మనం మన కోసం ఉపయోగించుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయుర్దాయాన్ని ఆగం చేస్తున్నాయి. ఓ వైపు టెక్నాలజీ పెరుగుతుంటే మరోవైపు మనిషి జీవితకాలం క్షీణిస్తోంది.

Human lifespan : టెక్నాలజీ పెరుగుతోందంటే... మనిషి ఆయుర్దాయం క్షీణించినట్ల
causes for decrease in human lifespan


టెక్నాలజీ పెరుగుతోంది. మనుషుల రోగాలు పెరుగుతున్నాయి. కారణం....సుఖవంతమైన జీవితం. మనం మన కోసం ఉపయోగించుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానాలే మనిషి ఆయుర్దాయాన్ని ఆగం చేస్తున్నాయి. ఓ వైపు టెక్నాలజీ పెరుగుతుంటే మరోవైపు మనిషి జీవితకాలం క్షీణిస్తోంది.

Heart attack అంటే లక్షణాలు కన్పించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి సడన్ గా వచ్చి చనిపోతారు. కొందరు నవ్వుతూనే చనిపోతున్నారు. కొందరు ఎక్కువ సంతోషంతోనూ చనిపోతారు, 75 శాతం యువతలో గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి రాదు. నేరుగా గుండెపోటే వస్తుంది.
కొందరిలో ఛాతీ మధ్య భాగంలో మంటగా, బిగుతుగా, బరువుగా ఉంటుంది. చెమటలు పట్టడం, వాంతులు కావడం వంటివి జరగొచ్చు.
తరచూ ఛాతీ నొప్పి వస్తే పరీక్షలు చేయించుకోవాలి. ఈసీజీ ద్వారా గుండె సమస్యను గుర్తించవచ్చు. మొదటిసారి చేసే ఈసీజీలో సమస్య బయటపడదు. ఈసీజీ సాధారణంగా ఉందంటే సమస్య లేదని కాదు , మరో 2, 3 సార్లు చేయించుకోవాలి.

గుండెపోటు రావడానికి ప్రధాన కారణం....రక్తపోటు, డయాబెటిస్. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మనిషికి చావును దగ్గర చేస్తున్నాయి. అది తెలిసి కూడా మనిషి మారలేకపోతున్నాడు. అంతేకాదు శారీరక శ్రమ లోపించినా గుండెపోటు రావచ్చు. కొంతమంది మాత్రం మితిమీరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సమయం పాడు లేకుండా కసరత్తులు చేస్తూ గుండెపోటుకు గురవుతున్నారు.


గతంలో 60 ఏళ్లు పైబడిన వారిలోనే గుండె సమస్యలు కనిపించేవి. నేడు ఆ సంఖ్య తగ్గుతూ 40 కు చేరింది. మధ్యవయసులోనే గుండెపోటుకు బలవుతున్నారు. దానికి చాలా కారణాలున్నాయి.

గుండెపోటు వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 50-60 ఏళ్లలో తల్లిదండ్రులకు గుండెపోటు వస్తే వారి పిల్లలు చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అంతేకాదు కార్డియాక్ అరెస్టుకు కూడా గురవుతారు.

కొందరు సిగరెట్ తాగితేనే గుండెపోటు వస్తుందనుకుంటారు. కానీ ధూమపానం పీల్చిన వారి పక్కన ఉన్నా మనకు రిస్కే. గుండెపోటు వస్తున్న ఐదుగురిలో ఒకరు మాత్రం కచ్చితంగా ధూమపానానికి అలవాటైన వాళ్లే. పొగ పీల్చడం వల్ల రక్తం గడ్డకట్టుకుపోయి సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు గట్టిగా తయారవుతాయి. తద్వారా రక్తపోటు పెరిగి కొవ్వు పేరుకుపోతుంది. ధూమపానం తాగేవారి పక్కన ఉంటే గుండెపోటు 20 నుంచి 30 శాతం పెరుగుతుంది. దీన్నే ‘పాసివ్‌ స్మోకింగ్‌’ అంటారు.


మంచి ఆహారం తీసుకోకుండా పోషకాలు లేని ఆహారం తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. లావుగా ఉన్నవారిలోనే కొవ్వు ఉంటుందనేది కేవలం అపోహ మాత్రమే. సన్నగా ఉన్నవారిలోనూ కొవ్వు ఉంటుంది. అది కేవలం రక్త పరీక్షల ద్వారా మాత్రమే నిర్ధరణ అవుతుంది. ఇది తెలుసుకున్న వాళ్లు ఇప్పటినుంచే ఆహారంలో మార్పుచేర్పులు కూడా చాలా అవసరం.


కరోనా వచ్చాక మనిషి అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఆహార పద్ధతుల్లోనూ గమనిస్తున్నాం. కానీ ఇంకా కొంతమంది నాణ్యమైన ఫుడ్ తీసుకోవట్లేదు. జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్‌, పీజ్జాలు, బర్గర్లు, చీజ్ ఫుడ్ తినడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. దానివల్ల చక్కెర స్థాయులూ పెరిగిపోతున్నాయి. కరోనా తర్వాత కొంతమంది వర్క్‌ ఫ్రమ్‌ హోంతో గంటల తరబడి కూర్చునే ఉంటున్నారు. తిన్న వెంటనే కూర్చుండి పోతున్నారు. దానివల్ల బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగిపోతున్నాయి. ఇంట్లో సమస్యలు, ఆందోళన, ఒత్తిడి కూడా గుండెపోటుకు కారణమే.

అంతులేని శారీరక శ్రమ, ఒత్తిడి వల్ల ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. మితిమీరిన కసరత్తు చేస్తే గుండెపై భారం పడుతుంది. వర్కవుట్స్‌తో స్పందన పెరిగి గుండెపోటు వస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.