కిడ్నీలో రాళ్లు ఉన్నాయని డౌటా..? ఇంట్లోనే ఈ టెస్ట్ చేయండి.. 

కిడ్నీలో రాళ్లు ఉండటం అనేది పెద్దసమస్యే అయినా.. మనం భయపడేంత సమస్య అయితే కాదు.. వీటిని తొలగించకోవడానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకూ.. కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి,

కిడ్నీలో రాళ్లు ఉన్నాయని డౌటా..? ఇంట్లోనే ఈ టెస్ట్ చేయండి.. 


కిడ్నీలో రాళ్లు ఉండటం అనేది పెద్దసమస్యే అయినా.. మనం భయపడేంత సమస్య అయితే కాదు.. వీటిని తొలగించకోవడానికి ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటివరకూ.. కిడ్నీలో రాళ్లు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, రాళ్లను ఎలా కరిగించుకోవాలి అనే మనం తెలుసుకున్నాం.. అసలు కిడ్నీలో రాళ్లు ఉంటే..ఇంటి దగ్గరే ఉండి ఎలా పరీక్షించుకోవచ్చు మీకు ఐడియా ఉందా..? ఒకవేళ మీకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని అనుమానం ఉంటే.. ఈ చిన్న టెస్ట్‌ చేయండి చాలు..! ఇట్టే తెలిసిపోతుంది. 

కిడ్నీ స్టోన్లు ఉంటే పొట్ట కింది భాగంలో.. అంటే బొడ్డుకు రెండు వైపులా చిన్న‌గా నొప్పి వ‌స్తుంది. కానీ దీన్ని గ్యాస్ అనుకుని పొర‌పాటు ప‌డుతుంటారు. కిడ్నీ స్టోన్లు చిన్న‌గా ఉన్న‌ప్పుడే ఈ నొప్పి వ‌స్తుంది. ఈ నొప్పి వెనుక వైపు కూడా అదే రెండు వైపులా వ‌స్తుంది. ఆ భాగాల్లో నొప్పి వ‌స్తుందంటే అనుమానించాల్సిందే. వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. కిడ్నీ స్టోన్స్ ఉంటే మూత్రం ముదురు గోధుమ రంగులో వ‌స్తుంది. మూత్రం ఘాటైన వాస‌న వ‌స్తుంది.

కిడ్నీలో రాళ్లు ఉంటే తెలుసుకునే టెస్ట్‌..

ఉద‌యాన్నే నిద్ర లేచాక మూత్రాన్ని ఒక గాజు గ్లాస్‌లో ప‌ట్టి 1 గంట సేపు క‌ద‌ల‌కుండా అలాగే ఉంచాలి. త‌రువాత మూత్రాన్ని ప‌రీక్షించాలి. అందులో న‌ల్ల‌ని రేణువులు, మ‌డ్డి ఉంటే.. కిడ్నీ స్టోన్లు ఉన్న‌ట్లు లెక్క‌. లేక‌పోతే మూత్రం క్లియ‌ర్‌గా ఉంటుంది.

కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డితే న‌డుం నుంచి కింది భాగంలో కొన్ని చోట్ల వాపులు వ‌స్తాయి. ఆ వాపుల‌ను గ‌మనిస్తుండాలి. దీంతో కిడ్నీ స్టోన్లు ఉన్నాయో, లేదో ప‌రీక్ష‌లు చేయించుకోవ‌చ్చు.

డ‌యాబెటిస్ ఉన్న‌వారే కాదు, కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు కూడా త‌రచూ మూత్ర విస‌ర్జ‌న‌కు వెళ్తుంటారు. మూత్ర విస‌ర్జ‌న చేసిన‌ప్పుడు నొప్పిగా అనిపిస్తుంది.

కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి త‌ర‌చూ జ్వ‌రం వ‌స్తుంటుంది. ఒక్కోసారి వికారం, అల‌స‌ట‌, వ‌ణుకు కూడా వ‌స్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి నొప్పి ఏమీ లేక‌పోయినా ఒక్కోసారి మూత్రంలో ర‌క్తం ప‌డుతుంది. ఇది ఎరుపు లేదా డార్క్ ప‌సుపు రంగులో ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.