Heart rhythm disorder : అకస్మాత్తుగా తల తిరుగుతూ ఒళ్లంతా చెమటలు పడుతుందా.. గుండె వేగం పెరిగిందా? జాగ్రత్త పడకపోతే ప్రమాదమే!

Heart rhythm disorder : కొన్నిసార్లు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నిలుచునట్టు ఉన్న పడిపోతున్న భావన కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే పర్లేదు కానీ ప్రతిసారి తల తిరగడంతో పాటు భ్రమగా అనిపించడం, విపరీతంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్త చేయకూడదు.

Heart rhythm disorder : అకస్మాత్తుగా తల తిరుగుతూ ఒళ్లంతా చెమటలు పడుతుందా.. గుండె వేగం పెరిగిందా? జాగ్రత్త పడకపోతే ప్రమాదమే!
Dizziness Excessive Sweating And Rapid Heart Rate


Heart rhythm disorder : కొన్నిసార్లు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నిలుచునట్టు ఉన్న పడిపోతున్న భావన కలుగుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే పర్లేదు కానీ ప్రతిసారి తల తిరగడంతో పాటు భ్రమగా అనిపించడం, విపరీతంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్త చేయకూడదు. మనిషికి తనతో పాటు చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా ఒక్కసారిగా కదులుతున్న భావన కలుగుతుంది. సాధారణంగా ఈ పరిస్థితి చెవిలో, తలలో సమస్యలు ఉంటే కనిపిస్తూ ఉంటుంది.

తలకి రక్తప్రసరణ తగ్గిపోయినా, తల వెనుక భాగంలో ఏవైనా దెబ్బలు తగిలినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు పరిస్థితి మరీ ప్రమాదంగా మారినప్పుడు రక్తనాళాలు తలభాగంలో పగిలి రక్తస్రావం అవుతున్న ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చిన్నతనంలో తల, మెడ భాగంలో ఏవైనా దెబ్బలు తగిలితే ఈ సమస్య వస్తుంది.

అయితే తల తిరగటానికి ఒకటే కారణం అని చెప్పలేము. చాలా వరకు మెడ, మెడ ఎముకల్లో ఏవైనా లోపాలు ఉన్నా లేక ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు తలకి చెవికి సంబంధించి సమస్యలు ఉన్నప్పుడు తలలో ఏవైనా గడ్డలు తయారవడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



ఈ తల తిరిగినప్పుడు ఒక్కోసారి వాంతులు, వికారం అనిపిస్తూ ఉంటుంది. కళ్ళు కూడా గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మరి కొన్నిసార్లు తల తిరగడంతోపాటు మాట సరిగ్గా రాకపోవటం, నడకలో మార్పు ఉండటం వంటివి జరుగుతాయి. ఇలాంటి సమయంలోనే తలలో రక్తం గడ్డ కట్టడం అంటే తీవ్రమైన సమస్యలు ఉన్నాయేమో తరచి చూసుకోవాలి.

కొన్నిసార్లు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, ఏ పని మీద శ్రద్ధ పెట్టకపోవడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. మనకు కొన్నిసార్లు చెమటలు పట్టడం, ఏదో తెలియని మాయ ఆవహించినట్టు అనిపించడం వంటివి జరుగుతాయి.

ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు తగ్గుతుందని ఆ జాగ్రత్త చేయకూడదు. వైద్యుల్ని సంప్రదించాలి లేదంటే క్రమంగా బరువు తగ్గిపోవడం, ఆకలి వేయకపోవడం, కంటి చూపుల మార్పు రావటం లాంటివి కనిపిస్తూ ఉంటాయి.

వైద్యుల్ని సంప్రదించినప్పుడు వ్యాధి తీవ్రతను బట్టి కచ్చితంగా చికిత్స అందిస్తారు. ఇలాంటి సమస్య ఉన్నవారు ఆకస్మాత్తుగా లేచి నిలబడటం, పడుకున్న వాళ్లు వెంటనే లేచి ఏదైనా పనిచేయడం వంటివి చేయకూడదు.

సిగరెట్టు, మందు అలవాటు ఉంటే మానేయాలి. ఎక్కువగా గాలి తగిలే ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. తల దగ్గర మరీ ఎత్తుగా ఉండే దిండు కూడా పెట్టుకోకపోవడమే మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.