Sesame oil : గర్భిణీ సుఖప్రసానికి నువ్వుల నూనెతో మొదటి నెల నుంచి ఇలా చేస్తే ఆపరేషన్ అవసరమే ఉండదు!

Pregnant గా ఉన్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పుట్టే బిడ్డ ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం పడటంతో పాటు తల్లి ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ శుభ్రంగా ఉండటమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిస్థితులను శుభ్రంగా ఉంచుకోవాలి.

Sesame oil : గర్భిణీ సుఖప్రసానికి నువ్వుల నూనెతో మొదటి నెల నుంచి ఇలా చేస్తే ఆపరేషన్ అవసరమే ఉండదు!
sesame oil to avoid pregnancy surgery


First month of pregnancy : ఒక బిడ్డ పుట్టిన దగ్గరనుంచి ఎదుగుదల, మానసిక పరిస్థితి, అతను భవిష్యత్తు పూర్తిగా ఆధారపడి ఉండేది తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకునే సంరక్షణ. ఈ సమయంలో గర్భిణీ ఎంత జాగ్రత్తగా ఉంటే బిడ్డ ఎదుగుదల అంత సక్రమంగా ఉంటుంది. మారిపోతున్న ఈ ఆధునిక కాలంలో ఎన్నో పరిస్థితులు తల్లికి పెను సవాలుగానే మారుతున్న విషయం తెలిసిందే. గర్భం ధరించిన దగ్గర్నుంచి ప్రతిక్షణం ఎంతో భయంతో బతుకుతూ వస్తుంది. అందుకే బిడ్డ పుట్టే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తోంది.
గర్భిణీగా ఉన్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే పుట్టే బిడ్డ ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం పడటంతో పాటు తల్లి ఆరోగ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీ శుభ్రంగా ఉండటమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిస్థితులను శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు తప్పకుండా రెండు సార్లు స్నానం చేయడం ధరించిన బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వదులుగా వేసుకోవడానికి వీలుగా ఉండే బట్టలను ధరించాలి. ఇబ్బంది కలిగించే బట్టలను శరీరానికి పట్టేసే బట్టలు ఉపయోగించకూడదు. ఎండలోకి వెళ్లాల్సి వస్తే హాని చేయని చిరాకు పెట్టని బట్టలు ఉపయోగించాలి.  నెల నెల పెరుగుతున్న కొలది బిడ్డ పిండంలో ఏర్పడే మార్పులను దృష్టిలో ఉంచుకొని బట్టలు వేసుకోవాలి. అలాగే బిడ్డకు అవసరమైన పోషకాలు అన్ని అందే విధంగా ఆహారం తీసుకోవాలి..

ఈ సమయంలో వాంతులు ఎక్కువగా అవుతుంటే తేలికైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారం బిడ్డను తల్లిని ఆరోగ్యకరమైన విధంగా ఉంచేదిగా ఉండాలి. బిడ్డ ఆరోగ్యంగా పెరిగేలా సహకరించేది కావాలి. వైద్యులు సూచించిన మేరకు మందులు తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఈ సమయంలో చక్కని సంగీతం వింటూ కథలు చదవడం వల్ల మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మంచి పుస్తకాలు చదివితే వాటి జ్ఞానం తప్పకుండా బిడ్డకి అందుతుందని తల్లి నుంచి ఎన్నో నాడులు బిడ్డకి అనుసంధానమే ఉంటాయని తెలుస్తోంది.
గర్భిణీ తేలికగా ప్రసవం అవ్వటానికి గర్భం ధరించిన దగ్గర నుంచి సమతుల ఆహారం ఎంతో అవసరం. విపరీతంగా ఒళ్ళు పెరిగించి ఇబ్బంది పెట్టె ఆహారాలని మానుకోవాలి. అలాగే ప్రోటీన్లు, పోషకాలు, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కానీ ఎక్కువ మాంసాహారాన్ని మాత్రం ముట్టుకోకూడదు. ఉమ్మనీరు తగ్గిపోకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గర్భం ధరించిన దగ్గర నుంచి పొట్ట పైన రోజు నువ్వుల నూనె పైనుండి కింద భాగం వరకు రాసుకుంటే సుఖ ప్రసవం అవుతుందని తెలుస్తోంది.. అయితే గట్టిగా మర్దన చేయడం అదిమిపెట్టి రాయటం వంటి పనులు చేయకూడదు నెమ్మదిగా నువ్వుల నూనెను పొట్ట పైన వేసి పైనుంచి కిందకి అరచేతులతో రాసుకోవాలి ఇలా చేయడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కండరాలు అన్ని వదిలేయి సుఖప్రసవానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా బిడ్డ ఆరోగ్యం విషయంలో తల్లి తీసుకునే జాగ్రత్తలు ఎంతో ప్రభావం చూపిస్తాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.