పప్పులు ఉడికించడానికి ముందు ఎంతసేపు నానపెట్టాలో తెలుసా.. పొట్టు ఉంటే మంచిదా? తీసేస్తే మంచిదా!

సాధారణంగా పప్పులను వండటానికి ముందు కాసేపు నీటిలో నానపెడుతూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు. వండే ముందు పప్పులను నానబెట్టడం మంచిదా కాదా కొన్నిసార్లు పొట్టు తీస్తూ ఉంటారు. వీటన్నిటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

HOW TO SOAK LENTILS AND BEANS — Jasmine Hemsley
పప్పులు, కాయధాన్యాలు నానబెట్టడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. పప్పులను వండడానికి ముందు నానబెట్టాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. పప్పులను నానబెట్టి ఉడకబెట్టుకోవడం ద్వారా వాటి ప్రయోజనాలు మరింత పెరుగుతాయని సమాచారం.
పప్పులు నానబెట్టుకొని తింటే, అది పోషకాల శోషణను మెరుగుపరచడమే కాకుండా, యాంటీ-న్యూట్రియంట్ ఫైటిక్ యాసిడ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. కాల్షియం, ఐరన్, జింక్‌లను బంధించడంలో సహాయపడుతుంది. నానబెట్టడం వంట సమయాన్ని తగ్గిస్తుంది ఇంకా పోషకాల లభ్యతను మెరుగుపరుస్తుంది. ఇలా తింటే కడుపు ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలు వంటివి ఉండవు.

పప్పులను ఎంతసేపు నానపెట్టాలంటే..

పప్పును నానబెట్టడం ఎంత ముఖ్యమో, నానబెట్టే వ్యవధి కూడా తెలిసి ఉండటం ముఖ్యం. పూర్తి ప్రయోజనాలను పొందేందుకు కొన్ని పప్పు ధాన్యాలను 8-10 గంటల పాటు నానబెట్టాల్సిన అవసరం ఉంటే, మరికొన్నింటికి 4-5 గంటల వ్యవధి సరిపోతుంది.
రెండుగా విభజించిన పప్పులు ఉడికించడం సులభం అందువల్ల వీటికి నానబెట్టే సమయం తక్కువగా ఉంటాయి. శనగపప్పు, కందిపప్పు, మినపపప్పు నానబెట్టడానికి 4-6 గంటలు సరిపోతుంది. పెసర్లు, కందులు, శనగలు మొదలైన చిక్కుళ్ళు 6-8 గంటలు నానబెట్టడం మంచిది. సోయాబీన్, కిడ్నీ బీన్స్, బెంగాల్ గ్రాము, బ్లాక్ బీన్స్ వంటి పెద్ద పప్పుధాన్యాలు రకాలను 8-10 గంటలు నానబెట్టడం వలన ప్రయోజనం ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.