పురాతన కాలంలో సెక్స్‌ చేయడానికి ఎన్నో నియమాలు ఉండేవి తెలుసా..?

మనిషికి తిండి, ఆహారం, నిద్ర మాత్రమే కాదు.. సెక్స్‌ కూడా బేసిక్‌ నీడ్. కాకకపోతే.. ముందు చెప్పిన మూడూ చిన్నప్పటి నుంచి కావాలి.. సెక్స్‌ మాత్రం ఒక వయసు వచ్చినప్పటి నుంచి లైఫ్‌లో భాగం అయిపోతుంది.

పురాతన కాలంలో సెక్స్‌ చేయడానికి ఎన్నో నియమాలు ఉండేవి తెలుసా..?


మనిషికి తిండి, ఆహారం, నిద్ర మాత్రమే కాదు.. సెక్స్‌ కూడా బేసిక్‌ నీడ్. కాకకపోతే.. ముందు చెప్పిన మూడూ చిన్నప్పటి నుంచి కావాలి.. సెక్స్‌ మాత్రం ఒక వయసు వచ్చినప్పటి నుంచి లైఫ్‌లో భాగం అయిపోతుంది. వీటిలో ఏది సరిగ్గా లేకపోయినా.. వాళ్లు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు మనం ఎంత టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నా.. ఇప్పటికీ చాలా మందికి సెక్స్‌ మీద పూర్తి అవగాహన లేదు. సెక్స్‌ ఎడ్యకేషన్‌ చాలా అవసరం. అది ఏ జంటకు అయితే పూర్తిగా తెలిసి ఉంటుందో.. వారు శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఇప్పుడు శారీరక సంబంధాలు చాలా లైట్‌ అయిపోయాయి. ప్రేమించిన వాళ్లతో పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొంటున్నారు. అది తప్పుగా కూడా చాలా మంది భావించడం లేదు. కానీ పురాతన కాలంలో ఇలా ఉండేది కాదు. సెక్స్‌ను చాలా పవిత్రమైనదిగా చూసేవాళ్లట. ఈరోజు మనం పురాతన కాలంలో సెక్స్‌ ఎలా చేసేవాళ్లు, అప్పుడు వాళ్లు ఎలాంటి పద్ధతులను ఫాలో అయ్యేవాళ్లో తెలుసుకుందాం.!  

అయితే, ప్రాచీన కాలంలో శారీరక సంబంధాలను చాలా పవిత్రంగా భావించేవారు. ఆ కాలపు ప్రజలు చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉండేవారు. వారు సెక్స్‌కు సంబంధించిన ప్రతి సమస్యపై స్వేచ్ఛగా మాట్లాడేవారట. రెండో శతాబ్దంలో ఆచార్య వాత్స్యాయన రచించిన కామసూత్ర గొప్ప బహుమతిగా పరగణించేవాళ్లు.
పురాతన కాలంలో భర్త లేదా భార్యతో కాకుండా ఇతరులతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం పూర్తి నిషేధం. ఇది అనైతిక చర్యగా పరిగణించేవారట. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వ్యక్తి తన జీవితాంతం పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. పురాతన కాలంలో ప్రదేశానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. శ్మశాన వాటికలు, పవిత్ర వృక్షాలు, గురుకులాలు, ఆసుపత్రులు, పవిత్ర, మతపరమైన ప్రదేశాలు మొదలైన వాటిలో శారీరక సంభోగం చేయరాదు. ఈ నియమాన్ని పాటించని వారిని రోగాలు చుట్టుముడుతాయని నమ్మేవారట.
పురాతన కాలం నుండి స్త్రీకి పిరియడ్స్ సమయంలో లైంగిక సంబంధం కలిగి ఉండకూడదని నమ్మేవారట. చేస్తే.. పురుషుడు వ్యాధి బారిన పడవచ్చని అనుకునేవారట. పిరియడ్స్ తర్వాత ఐదో రోజు, ఆరవ, పద్నాలుగో, పదహారవ రోజులలో మాత్రమే సెక్స్ చేసేవారు. పురుషులు, మహిళలు ఇద్దరూ పూర్తిగా నగ్నంగా ఉన్నప్పుడు లైంగిక సంబంధంలో పాల్గొనకూడదట. ఒక గుడ్డ లేదా వస్త్రాన్ని శరీరంపై ఉంచాలి. దీని వెనుక కారణం ఏమిటంటే, ఏదైనా ప్రమాదం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే.. నగ్నంగా ఉండకూడదనట.
పురాతన కాలంలో పురుషులు, మహిళలు ఇద్దరూ కామ శాస్త్ర జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యమైనదిగా భావించబడింది. ఆచార్య వాత్స్యాయన ప్రకారం, కామ శాస్త్ర జ్ఞానం భార్యాభర్తల లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఇది వారి వైవాహిక జీవితాన్ని సంతోషపరుస్తుంది.
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు సంభోగానికి దూరంగా ఉండాలి, లేకుంటే బిడ్డకు ప్రమాదం ఉంటుందని నమ్మేవాళ్లట. స్త్రీ పురుషులు ఉదయం-సాయంత్రం పూజ సమయంలో లేదా పగటిపూట సెక్స్‌కు దూరంగా ఉండాలి. సూర్యాస్తమయం, సూర్యోదయం, గ్రహణం, మృత్యువు, శ్రాద్ధం, అమావాస్య, నక్షత్రం, భాద్ర, దివాకాల సమయంలో కూడా శారీరక సంబంధం పెట్టుకోకూడదని నమ్మేవారు. అలా చేయడం వల్ల ఆ వ్యక్తి సంపాదించిన పుణ్యం నశిస్తుందట.
పురాతన నియమాల ప్రకారం, రాత్రి వేళల్లో శృంగారంలో పాల్గొనడం సముచితమని చెబుతారు. అయితే అర్ధరాత్రి సంభోగం చేసేవాళ్లు కాదట. ఆ సమయంలో శృంగారం జరిగి ఒకవేళ ఆ సమయం ద్వారానే బిడ్డ కలిగితే పుట్టిన బిడ్డ రాక్షస స్వభావం కలిగి ఉంటుందని నమ్ముతారు. పురాతన కాలంలో భాగస్వామి, సంకల్పం, సమ్మతి విలువైనదిగా భావించేవారట. భాగస్వామి సెక్స్ చేయకూడదనుకుంటే, అటువంటి పరిస్థితిలో ఎలాంటి బలవంతం చేసినా నేరంగా పరిగణించేవారు. అప్పట్లో సెక్స్‌ చేయాడనికి ఒక ప్లానింగ్‌, విజన్‌, పద్ధతి అన్నీ ఉండేవనమాట.. కానీ ఇప్పుడు ఎలా ఉందో మీ అందరికీ తెలిసే ఉంటుందిలేండి!
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.