సొరకాయ ఆకులు తినడం వల్ల బరువు త్వరగా తగ్గొచ్చు తెలుసా..?

ఆకుకూరలు డైలీ తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. పైగా మీ చర్మం కూడా మంచి గ్లోయింగ్‌ వస్తుంది. డైలీ మనం ఏదో ఒక కూర వండుకుంటాం. ఆకు కూరలంటే.. కేవలం తోటకూర, పాలకూర, గోంగూర లాంటివే కాదు.. కూరగాయల ఆకులు కూడా తినొచ్చు తెలుసా..? సొరకాయ ఉంటుంది.. సొరకాయను మాత్రమే కాదు.. దాని ఆకులను కూడా వాడుకొవచ్చు. వీటి వల్ల మీ ఎముకలు స్ట్రాంగ్‌గా అవుతాయి.

సొరకాయ ఆకులు తినడం వల్ల బరువు త్వరగా తగ్గొచ్చు తెలుసా..?


ఆకుకూరలు డైలీ తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు. పైగా మీ చర్మం కూడా మంచి గ్లోయింగ్‌ వస్తుంది. డైలీ మనం ఏదో ఒక కూర వండుకుంటాం. ఆకు కూరలంటే.. కేవలం తోటకూర, పాలకూర, గోంగూర లాంటివే కాదు.. కూరగాయల ఆకులు కూడా తినొచ్చు తెలుసా..? సొరకాయ ఉంటుంది.. సొరకాయను మాత్రమే కాదు.. దాని ఆకులను కూడా వాడుకొవచ్చు. వీటి వల్ల మీ ఎముకలు స్ట్రాంగ్‌గా అవుతాయి. ఈరోజు మనం సొరకాయ ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.  
ఎముకలు బలహీనపడటానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ చాలా ముఖ్యమైన కారణాలు వయస్సు పెరగడం, కాల్షియం, ఖనిజాల లోపం, నిశ్చల జీవనశైలి, పొగాకు, ఆల్కహాల్ వినియోగం, ఊబకాయం మొదలైనవి. కానీ చాలా మంది చిన్న వయస్సులోనే ఎముకలు బలహీనం అవుతాయి. 
ఎముకల బలం కూడా తగ్గుతున్నట్లయితే, షుగర్ లేదా బరువు చాలా పెరిగితే, సొరకాయ ఆకులు మీకు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అవును, కూరగాయలో లేని ఇలాంటి మూలకాలు ఈ ఆకుల్లో చాలా ఉన్నాయి. ఈ ఆకులు ఆయుర్వేదంలో ఔషధ గుణాల గని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. .
Zucchini Leaves » All the Top Tips & Facts
ఆయుర్వేదంలో సొరకాయ ఆకులను కూరగాయల కంటే ఎక్కువ ప్రభావవంతంగా భావిస్తారు. ఈ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కనిపిస్తాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కావాలంటే ఈ ఆకుల రసాన్ని కూడా తీసుకోవచ్చు.
సొరకాయ ఆకులను ఎముకలకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ కూరగాయలలో కాల్షియం ,భాస్వరం తగినంత పరిమాణంలో ఉంటుంది. ఈ రెండు ఖనిజాలు ఎముకల బలాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పరిగణించబడతాయి.
ఊబకాయం నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బాధిస్తున్న సమస్య. బరువు పెరగడం వల్ల బోనస్‌గా బీపీ, షుగర్‌ కూడా వస్తాయి. సొరకాయ ఆకుల జ్యూస్‌ తాగితే బరువు త్వరగా తగ్గుతారు. నిజానికి ఈ కూరగాయలో ఉండే పీచు ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది.
సొరకాయ ఆకులతో పాటు కూరగాయ మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ ఆకులు శరీరంలో పెరుగుతున్న బ్లడ్ షుగర్ లెవెల్‌ను కంట్రోల్ చేస్తాయి. ఈ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఈ ఆకులను క్రమం తప్పకుండా తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.