ఆయిల్‌ ఫుడ్స్‌ తింటే మొటిమలు వస్తాయనుకుంటున్నారా..?

ఆయిల్‌ ఫుడ్స్‌ : చాలామంది స్కిన్‌ విషయంలో ఇతరులు పాటించిందే ఫాలో అయిపోతారు. వాళ్ల చర్మానికి అది సెట్‌ కాకపోతే.. ఆ ప్రొడెక్ట్‌ వేస్ట్‌ అనుకుంటారు. అలాగే బాగా ఆయిల్‌ ఉన్న ఆహారాలు తింటే మొటిమలు వస్తాయని మీతో సహా అందరూ నమ్ముతున్నారు..

ఆయిల్‌ ఫుడ్స్‌ తింటే మొటిమలు వస్తాయనుకుంటున్నారా..?


ఆయిల్‌ ఫుడ్స్‌ : చాలామంది స్కిన్‌ విషయంలో ఇతరులు పాటించిందే ఫాలో అయిపోతారు. వాళ్ల చర్మానికి అది సెట్‌ కాకపోతే.. ఆ ప్రొడెక్ట్‌ వేస్ట్‌ అనుకుంటారు. అలాగే బాగా ఆయిల్‌ ఉన్న ఆహారాలు తింటే మొటిమలు వస్తాయని మీతో సహా అందరూ నమ్ముతున్నారు.. కానీ అది అపోహ మాత్రమే.. మీరు ఇన్ని రోజులు బలంగా నమ్మే కొన్ని అపోహలు.. వాటి వాస్తవాలు మీకోసం..ఇందులో మీరు ఎన్ని నమ్ముతున్నారో చూడండి.

Oils You Should Use To Maximise Food Flavour | Goodman Fielder

అపోహ: నూనె ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల యాక్నె వస్తుంది.
వాస్తవం: చర్మం నుంచి విడుదలయ్యే నూనె లాంటి సీబమ్ వల్ల యాక్నె వస్తుంది. ఆయిలీ ఫుడ్ తింటే యాక్నె వస్తుందనటానికి ఎలాంటి రుజువు లేదు.

అపోహ: జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు మాయిశ్చరైజర్ అవసరం లేదు.
వాస్తవం: అన్ని రకాల చర్మతత్వం ఉన్నవాళ్లు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇది చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

అపోహ: ఎండ ఉన్నప్పుడే సన్‌స్క్రీన్ రాసుకోవాలి
వాస్తవం: యూవీ కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. అందుకే ఎండ లేకపోయినా కూడా ప్రతి రోజూ సన్‌స్క్రీన్ రాసుకోవాలి.

అపోహ: ఖరీదైన ఉత్పత్తులే ఎక్కువగా పనిచేస్తాయి
వాస్తవం: ఖరీదైన ఉత్పత్తులే బాగుంటాయని ఏం లేదు. తక్కువ ధరలో అయినా చర్మానికి తగ్గట్లు ఎంచుకోవాలి.. వాటిలో వాడే రసాయనాలను బట్టి వాటి. పనితీరు ఉంటుంది.

ఎక్కువగా క్రీములు వాడితే మంచి పలితాలుంటాయి
వాస్తవం: నిజానికి అవసరమైనదానికన్నా ఎక్కువ క్రీములు రాసుకోవడం వల్ల చర్మం పొడిగా మారుతుంది. అందుకే ఏదైనా ఉత్పత్తి వాడేటపుడు ఎంత రాసుకోవాలో స్పష్టత ఉండాలి. ప్యాకేజింగ్ మీద దానికి సంబంధించిన వివరాలు చూడండి.

అపోహ: సహజమైన పదార్థాలే చర్మానికి మంచివి
వాస్తవం: వాటివల్ల చర్మానికి మేలు జరుగుతుంది. అలాని ప్రతిదీ మంచిది కాదు. చర్మానికి నప్పే పదార్థాలేంటో తెలుసుకుని వాడాలి. కొన్ని సార్లు, కొన్ని సమస్యలకు సహజ పదార్థాలకన్నా క్రీములు, సౌందర్య ఉత్పత్తులే బాగా పనిచేయొచ్చు.

అపోహ: ఎస్‌పీ‌ఎఫ్ ఎంత ఎక్కువుంటే అంత మంచిది
వాస్తవం: సన్ స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. కానీ ఎస్‌పీ‌ఎఫ్ ఒక్కటే ముఖ్యం కాదు. బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్, ఎస్‌పీ‌ఎఫ్ 30 నుంచి 50 మధ్యలో ఎంచుకోవాలి.

అపోహ: ప్రతిరోజూ స్క్రబింగ్ చేయడం మంచిది
వాస్తవం: ఎక్కువగా స్క్రబ్ చేయడం వల్ల చర్మం మీద ఉన్న సహజ నూనెలు తగ్గిపోతాయి. దద్దుర్లు, చర్మం పొడిబారడం సమస్యలొస్తాయి. వారానికి ఒకసారి స్క్రబింగ్ చేసుకుంటే చాలు.

మీ చర్మతత్వం గురించి తెలుసుకుని దానికి తగ్గ రొటీన్ ఫాలో అవ్వండి. మీకు నప్పే ఉత్పత్తులు ఎంచుకోండి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.