Cow milk : ఆవు పాలు తాగితే ఎత్తు పెరుగుతారా..? ఇందులో నిజమెంత

Cow milk : ఎదిగే పిల్లలకు పాలు ఇవ్వడం సర్వసాధారణం.. అప్పుడే వారి ఎత్తు, బరువు బాగుంటాయి. అయితే చాలామంది పిల్లలకు గేదె పాలనే ఇస్తుంటారు. కానీ మీకు తెలుసా.. ఆవు పాలు తాగితే ఎత్తు పెరుగుతారని.

Cow milk : ఆవు పాలు తాగితే ఎత్తు పెరుగుతారా..? ఇందులో నిజమెంత
Does drinking cows milk increase height


Cow milk : ఎదిగే పిల్లలకు పాలు ఇవ్వడం సర్వసాధారణం.. అప్పుడే వారి ఎత్తు, బరువు బాగుంటాయి. అయితే చాలామంది పిల్లలకు గేదె పాలనే ఇస్తుంటారు. కానీ మీకు తెలుసా.. ఆవు పాలు తాగితే ఎత్తు పెరుగుతారని. ఇప్పటికే కొంతమంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. అయితే సైంటిస్టులు చెప్పే ముచ్చట ఏందంటే..

ఆవు పాల‌ను తాగితే పొడ‌వు పెరుగుతార‌న్న విష‌యం నిజ‌మే. కానీ అది పెద్ద‌ల‌కు వ‌ర్తించ‌దట.. చిన్నారుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుందట.. అంటే ఎదిగే పిల్లలకు ఆవుపాలుఇవ్వడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంది. .చిన్నారుల‌కు ఆవు పాల‌ను తాగిస్తే స‌గటున ఇత‌ర పిల్ల‌ల క‌న్నా.. అంటే ఆవు పాల‌ని తాగ‌ని పిల్ల‌లు 0.2 సెంటీమీట‌ర్ల ఎత్తు ఎక్కువ‌గా ఉన్నార‌ని గతంలోనే సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. 

చిన్నారుల‌కు ఆ వ‌య‌స్సు నుంచే ఆవు పాల‌ను తాగించాలి. దీంతో ఇత‌ర పిల్ల‌లతో పోల్చితే వారు కొంచెం ఎత్తు ఎక్కువ‌గా ఉంటార‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ పెద్ద‌ల‌కు ఇది ఏమాత్రం వర్తించదు. ఆవు పాల‌ను పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో పెరుగుద‌ల సరిగ్గా ఉంటుంద‌ని కెన‌డాకు చెందిన సెయింట్ మైకేల్ హాస్పిట‌ల్ సైంటిస్టులు చెబుతున్నారు. వారిలో పెరుగుదల లోపం ఏర్ప‌డ‌ద‌ని.. వ‌య‌స్సుకు త‌గిన ఎత్తు ఉంటారని అంటున్నారు.. కానీ పెద్ద‌లు ఆవు పాల‌ను తాగితే పొడ‌వు పెర‌గ‌రు. కాక‌పోతే అధిక బ‌రువు ఉన్న‌వారికి, గుండె జ‌బ్బులతో బాధ‌ప‌డుతున్న వారికి.. పాల‌ను స‌రిగ్గా జీర్ణం చేసుకోలేని వారికి.. ఆవు పాలు మంచివ‌ని.. అలాంటి వారు రోజూ ఆవు పాల‌ను తాగ‌వ‌చ్చు. 18 నుంచి 20 ఏళ్లు వ‌చ్చాక అందరికీ ఎత్తు పెరుగుద‌ల ఆగిపోతుంది.

చాలామంది తల్లిందండ్రులు తమ పిల్లలు సరిగ్గా ఎత్తులేరని బాధపడుతుంటారు. అలాంటి వారు.. వాళ్ల పిల్లలకు ఆవుపాలను కూడా ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. కేవలం ఆవుపాలతో పాటు.. వారికి సరైన పోషకాలను అందేలా చూసుకోవాలి. చిన్నవయసులో పెట్టే ఫుడ్డే వారికి భవిష్యత్తులో ఎలాంటి పోషకాహార లోపం రాకుండా చూసుకుంటుంది. కాబట్టి చిన్నపిల్లలకు సరైన ఆహారం..అంటే కేవలం ఇంట్లో చేసింది మాత్రమే ఇవ్వాలి. ఆ వయసునుంచే బయట ఆహారాలను అలవాటు చేస్తే..మీ చేతుల్తో మీరే విషం ఇచ్చినట్లే అని వైద్యులు అంటున్నారు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.