Oligospermia : పురుషుల్లో ఒలిగోస్పెర్మియా వంధత్వానికి దారితీస్తుందా..?

Oligospermia : సంతానలేమికి భార్య భర్త ఇద్దరూ కారణమే.. కొన్నిసార్లు లోపం స్త్రీలలో ఉంటే. మరి కొన్నిసార్లు పురుషులలో ఉంటుంది. ప్రతి ఆరు జంటలలో ఒకరు వంధ్యత్వానికి సంబంధించిన సమస్యను ఎదుర్కొంటున్నారు. సంతానోత్పత్తి సమస్యలకు

Oligospermia : పురుషుల్లో ఒలిగోస్పెర్మియా వంధత్వానికి దారితీస్తుందా..?


Oligospermia : సంతానలేమికి భార్య భర్త ఇద్దరూ కారణమే.. కొన్నిసార్లు లోపం స్త్రీలలో ఉంటే. మరి కొన్నిసార్లు పురుషులలో ఉంటుంది. ప్రతి ఆరు జంటలలో ఒకరు వంధ్యత్వానికి సంబంధించిన సమస్యను ఎదుర్కొంటున్నారు. సంతానోత్పత్తి సమస్యలకు సంబంధించి నమోదయ్యే ప్రతీ మూడు కేసుల్లో ఒకటి మగవారికి సంబంధించినదే అయి ఉంటుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా ఒక జంట సహజంగా గర్భం ధరించాలంటే పురుష భాగస్వామి ఆరోగ్యకరమైన స్పెర్మ్ కౌంట్ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

నిజానికి పురుషులలో లక్షలు, కోట్లలో శుక్రకణాల ఉత్పత్తి జరిగినప్పటికీ, ఒక స్త్రీ గర్భవతి కావడానికి అందులో కేవలం ఒకే ఒక్క శుక్రకణం మాత్రం చాలు. కా ఎందుకంటే స్త్రీ నుంచి సాధారణంగా ప్రతినెల ఒక అండం మాత్రమే విడుదల అవుతుంది. శుక్రకణంతో ఆ అండం ఫలదీకరణ చెందింతే పిండంగా మారుతుంది. కానీ అందుకు మగవారి వీర్యంలో శుక్రకణాలు ఎక్కువ ఉండాలి, అవి నాణ్యమైనవి అయి ఉండాలి, అవి మంచి చలనశీలత కలిగి ఉండాలి. అప్పుడే అందులోని ఏదో ఒక శుక్రకణం అన్ని అడ్డంకులను దాటుకొని స్త్రీ అండాశయం వరకు చేరి, ఆ అండానికి అతుక్కోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే స్త్రీ గర్భవతి అవుతుంది.
కొన్ని అలవాట్లు పురుషులలో ఒలిగోస్పెర్మియాకు కారణం అవుతున్నాయి. స్పెర్మ్ కౌంట్‌ తక్కువ ఉండే పరిస్థితిని ఒలిగోస్పెర్మియా (Oligospermia) అంటారు, స్పెర్మ్ అసలే లేకపోతే ఆ పరిస్థితిని అజోస్పెర్మియా (Azoospermia) అంటారు. సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 15 మిలియన్ కంటే తక్కువ స్పెర్మ్ ఉంటే దానిని తక్కువ స్పెర్మ్ కౌంట్ అంటారు.

స్పెర్మ్‌ కౌంట్‌ నివారణకు చికిత్స..

పురుషులు తమ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందని చింతించాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో, కొన్ని జీవనశైలి మార్పులతో ఒలిగోస్పెర్మియాను నివారించడం, చికిత్స చేయడం కూడా సాధ్యమవుతుంది. ఇందుకోసం ఏం చేయాలో చూడండి...
మద్యపానాన్ని పరిమితం చేయండి. ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా మానేయాలి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలి.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి.
రోజూ రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి.
బిగుతైన లోదుస్తులు, వృషణాలకు వేడికలిగించే విధంగా దుస్తులు ధరించకూడదు.
స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు వైద్యులు సూచించిన ఔషధాలు వాడాలి. కొంతమందికి శస్త్రచికిత్స లేదా హార్మోన్ చికిత్స అవసరం కావచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.