అర్రే.. కాళ్లు, చేతుల చర్మం నల్లగా అవుతుందా..? ఇలా చేయండి..! 

మనకు ముఖం మీద ఉన్న శ్రద్ధ కాళ్లు, చేతుల మీద ఉండదు. ఎంతసేపు ముఖం తెల్లగా ఉండాలనే చూస్తారు కానీ ఈ కాళ్లు, చేతులను పెద్దగా పట్టించుకోరు. అందుకే మొదటి నుంచే ఇవి కాస్త ముఖం రంగు కంటే ఎక్కువ నల్లగా ఉంటాయి. టాన్‌ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ టాన్‌ను తొలగించుకోవడం పెద్ద సమస్యేం కాదు. ఈరోజు మనం కాళ్లు, చేతుల నలుపు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

బంగాళాదుంప రసం స్కిన్ టానింగ్‌ను తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. బంగాళదుంప రసం క్లెన్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. చేతులు, కాళ్ళ చుట్టూ ఉన్న చర్మంపై బంగాళాదుంప రసాన్ని రాయండి. బంగాళదుంప రసాన్ని చర్మంపై నిరంతరం రాసుకుంటే నలుపు తగ్గుతుంది.
Why do hands and feet get black? - Quora
ఇక రెమెడీని తయారు చేయడానికి, బొప్పాయిని ఒక గిన్నెలో తీసి మెత్తగా పేస్ట్‌ చేయండి. రెండు చెంచాల తేనె వేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ చేతులు, పాదాలకు అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం చల్లగా మారుతుంది. స్కిన్‌ టాన్‌ అంతా పోతుంది.
 
చర్మంపై ఉన్న బ్లాక్ హెడ్స్ ను తొలగించేందుకు నిమ్మకాయ పనిచేస్తుంది. నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ చర్మానికి సహజమైన మెరుపును తీసుకురావడానికి పనిచేస్తుంది. దీని కోసం, నిమ్మకాయను సగానికి కట్ చేసి, దానికి చక్కెర జోడించండి. తర్వాత నల్లగా ఉన్న చర్మంపై నిమ్మకాయను సున్నితంగా రుద్దండి. ఇలా చేయడం వల్ల నలుపు త్వరగా తగ్గుతుంది.
స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేయడానికి టొమాటో ఉత్తమం. ఈ టొమాటో రెమెడీ చేయడానికి టొమాటోని కట్ చేసుకోని టాన్‌ ఉన్న స్కిన్‌పై అప్లై చేయండి. ఒక గంట ఆగి క్లీన్‌ చేసుకోండి. లేదా రాత్రి నిద్రపోయే ముందు టమోటా రసం అప్లై చేసుకుని పడుకుని ఉదయాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు.అయితే టమోటా మరకలు బెడ్‌కు అంటుకుంటాయి, కాబట్టి ఇది సాధ్యపడకపోవచ్చు. టొమాటోలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి అనేక సమస్యలను నయం చేసే శక్తిని కలిగి ఉంటుంది. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.