Skin care : మెరిసే చర్మమే మేలిమి బంగారం.. తెలియక ఈ తప్పులు చేసి పాడు చేసుకోవద్దు.  

Skin care : అందమైన చర్మం అంటే తెల్లగా నిగనగాడే చర్మం మాత్రమే కాదు ఛాయ ఒక్కటే మనిషి అందానికి కొలమానం కాదు. ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా అందంగా ఉండే చర్మం మేలిమి బంగారం. ఈరోజుల్లో చాలా రకాల తప్పులు చేసి దీనిని నాశనం చేసుకుంటూ ఉంటున్నారు.

Skin care : మెరిసే చర్మమే మేలిమి బంగారం.. తెలియక ఈ తప్పులు చేసి పాడు చేసుకోవద్దు.  
Don't spoil your shiny skin with these mistakes


Healthy skin : ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేనిది మానవ శరీరం, ఆరోగ్యం. అందమైన శరీరం, ముఖ కవళికలు, సక్రమమైన అవయవాలు ఇవన్నీ పుట్టుకతోనే దొరికే వరం. కొందరికి ఇవి లేక బాధపడుతూ ఉంటే మరి కొందరు ఉన్న అందాన్ని, ఆరోగ్యాన్ని తెలిసి తెలియని తప్పులు చేసి నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే skin విషయంలో కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయని తెలుస్తోంది.

అందమైన చర్మం అంటే తెల్లగా నిగనగాడే చర్మం మాత్రమే కాదు ఛాయ ఒక్కటే మనిషి అందానికి కొలమానం కాదు. ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా అందంగా ఉండే చర్మం మేలిమి బంగారం. ఈరోజుల్లో చాలా రకాల తప్పులు చేసి దీనిని నాశనం చేసుకుంటూ ఉంటున్నారు.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బయట దొరికే రసాయనాలతో కూడిన క్రిములు వాడటం ముందుగా తగ్గించుకోవాలి. అందం కోసం పరితపించి మొహానికి వాడే పలు రకాల లేపనాలు మొహంపై మొటిమలు సమస్యకు దారితీస్తాయి. ఈ మొటిమల తో పాటు మచ్చలు కూడా వస్తాయి. అందంగా ఉండటానికి ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ఇది అందరి మొహానికి సరిపోదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందులో వాడే అధిక గాడుతూ ఉన్న క్రీములు, ఎక్కువగా ఉపయోగించే మసాజ్ వంటివి సున్నతమైన మొహం చర్మాన్ని ఇబ్బంది పెడతాయి.

ఫేషియల్ చేసే సమయంలో అవసరం లేకపోయినా కొన్ని క్రిములు ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి తర్వాత కాలంలో ఎంతో ఇబ్బందికి గురి చేస్తాయి.

క్రీములు, పౌడర్లు వంటివి నిపుణుల సలహా మేరకు వాడటం మంచిది. ఒత్తిడిని తగ్గించుకొని సంతోషంగా ఉంటే అందం మీ మొహం లో కనిపిస్తుంది. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

మెరిసే చర్మం కోసం పాలు, క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు వంటి వాటిని తీసుకోవాలి. కనీసం వారానికి ఒక్కసారైనా స్వచ్ఛమైన నువ్వుల నూనెను ఒంటికి రాసుకొని నలుగు పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

మేకప్ ఉపయోగించాల్సి వచ్చినవారు కచ్చితంగా రాత్రి పడుకునే ముందు దాన్ని తొలగించే పడుకోవాలి. ఇందుకోసం పచ్చిపాలను కానీ మంచి నువ్వులను నేను కానీ ఉపయోగించాలి. ఇలా మొత్తం మేకప్ ను తుడుచుకున్నాక ఫేస్ ను శుభ్రంగా కడుక్కొని అప్పుడే నిద్ర పోవాలి. చాలా వరకు మేకప్ ను తక్కువగా వేసుకోవడానికి చూడాలి.

ఈ కాలంలో దొరికే పుచ్చకాయ, బొప్పాయి వంటి గుజ్జును మొహానికి రాసుకోవడం వల్ల మొహం కళను సంతరించుకుంటుంది.

మొహం పైన శరీరం పైన ఎక్కడైనా మచ్చలు ఉంటే మంచి తేనె ను రాయడం వల్ల అవి వెంటనే పోతాయి.

నూనె పదార్థాలు, వేపుడు పదార్థాలు, బయట దొరికే ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. ఇవి చర్మ సంబంధించిన సమస్యలకు కారణం అవుతాయి. 

ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు కచ్చితంగా స్కార్ఫ్ కట్టుకోవడం, తలకు క్యాప్ పెట్టుకోవడం వంటివి మర్చిపోకూడదు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.