ఈ డ్రింక్ తాగితే చాలు..తక్షణమే మీ మైగ్రైన్ మాయం..డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు..

మనలో చాలా మంది మైగ్రైన్ సమస్యతో బాధపడుతుంటారు..ఒత్తిడి, ఆందోళన, ఎక్కువగా ఆలోచించడం, డిఫ్రెషన్ వంటి కారణాల చేత ఈ తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..అలాగే స్త్రీలల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. పురుషుల్లో కంటే స్త్రీలల్లోనే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. మైగ్రేన్ కారణంగా శబ్దాలను అస్సలు వినలేకపోవడం

ఈ డ్రింక్ తాగితే చాలు..తక్షణమే మీ మైగ్రైన్ మాయం..డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు..


మనలో చాలా మంది మైగ్రైన్ సమస్యతో బాధపడుతుంటారు..ఒత్తిడి, ఆందోళన, ఎక్కువగా ఆలోచించడం, డిఫ్రెషన్ వంటి కారణాల చేత ఈ తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..అలాగే స్త్రీలల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా ఈ సమస్య తలెత్తుతుంది. పురుషుల్లో కంటే స్త్రీలల్లోనే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. మైగ్రేన్ కారణంగా శబ్దాలను అస్సలు వినలేకపోవడం, వెలుతురును చూడలేకపోవడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మన ఇంట్లోనే ఒక పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. మైగ్రేన్ ను తగ్గించే ఈ ఆయుర్వేద పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
The Phases and Anatomy of a Migraine Attack - MigraineDisease.org
ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 200 ఎమ్ ఎల్ నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు కొద్దిగా వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం రసం వేసి కలపాలి. తరువాత ఇందులో అర చెంచా దాల్చిన చెక్క పొడి, ఒక టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. ఈ నీటిని 100 ఎమ్ ఎల్ అయ్యే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు చల్లార్చాలి. నీళ్లు గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో 5 నుండి 6 చుక్కల నిమ్మరసం వేసి కలిపి తాగాలి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. అదే విధంగా గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, అల్లం రసం వేసుకొని తాగిన మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ట్రై చెయ్యండి..

ఈ పానీయంతో మైగ్రైన్ సమస్యకు చెక్..

ప్రతిరోజూ నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా మైగ్రేన్ సమస్య తగ్గుతుంది. అదే విధంగా ఒక ఆపిల్ ముక్క మీద ఉప్పును చల్లుకుని తినడం వల్ల కూడా మైగ్రేన్ సమస్య తగ్గుతుంది..
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.