Weight loss : బరువు తగ్గాలని తేనె, నిమ్మరసం నీటిని తాగేస్తున్నారా..?

Lemon and honey : అధిక బరువును తగ్గించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది.. రోజు ఉదయం లేవగానే గోరు వెచ్చని నీళ్లలో తేనె, నిమ్మరసం వేసుకుని తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మనందరికి తెలుసు.

Weight loss : బరువు తగ్గాలని తేనె, నిమ్మరసం నీటిని తాగేస్తున్నారా..?
Drinking honey and lemon water to lose weight


Lemon and honey : అధిక బరువును తగ్గించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది.. రోజు ఉదయం లేవగానే గోరు వెచ్చని నీళ్లలో తేనె, నిమ్మరసం వేసుకుని తాగుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మనందరికి తెలుసు. ఇలా తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే కొవ్వును తేనె క‌రిగిస్తుంద‌ని త‌ద్వారా బ‌రువు త‌గ్గుతార‌ని భావిస్తూ ఉంటారు. కానీ ఇది అంతా అపోహ మాత్ర‌మే అని.. తేనెకు శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే శ‌క్తి లేద‌ని నిపుణులు అంటున్నారు..

తేనెకే కాకుండా అస‌లు ఎటువంటి ఆహార ప‌దార్థానికి కూడా శ‌రీరంలో కొవ్వును నేరుగా క‌రిగించే శ‌క్తి లేద‌ని నిపుణులు అంటున్నారు.. మ‌నం ఇడ్లీ, దోశ‌, ఉప్మా వంటి వాటిని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు 500 నుండి 550 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. మ‌న శ‌రీరానికి మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసే వ‌ర‌కు ఈ శ‌క్తి సరిపోతుంది.

ఉద‌యం అల్పాహారంలో ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తిన‌కుండా కేవ‌లం మూడూ లేదా మూడున్న‌ర టీ స్పూన్ల తేనెను నీటిలో కలిపి తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి 200 నుండి 225 క్యాల‌రీల శ‌క్తి మాత్ర‌మే ల‌భిస్తుంది. మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యం వ‌రకు శ‌రీరానికి ఈ శ‌క్తి స‌రిపోదు. క‌నుక పేరుకు పోయిన కొవ్వును క‌రిగించి శ‌రీరం త‌న జీవ‌క్రియ‌ల‌కు వాడుకుంటుంది.

తేనెకు కొవ్వును కరిగించే శక్తి లేదా..?

శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వు క‌ర‌గ‌డం వ‌ల్ల‌ మ‌నం బ‌రువు త‌గ్గుతాము. కానీ తేనె నేరుగా శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వును క‌రిగించ‌దు. తేనె ప‌రిమాణంలో బెల్లం, చెరుకు ర‌సాన్ని నీటిలో క‌లిపి తాగిన కూడా మ‌నం బ‌రువు త‌గ్గుతాము. కానీ వీటిని ఎక్కువ ప‌రిమాణంలో తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మంచిది కాదు.. తేనె నీటిని తాగ‌డం ఉత్త‌మం. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఉద‌యం అల్పాహారంలో ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను తీసుకోకుండా తేనె నీటిని మాత్ర‌మే తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే బ‌రువు త‌గ్గుతారు. కానీ అందరూ ఏ చేస్తారంటే.. తేనె నీటిని తాగి.. ఓ గంట ఆగి మళ్లీ టిఫెన్ చేస్తారు. తేనె నీటితో పాటు అల్ప‌హారాన్ని కూడా తీసుకోవ‌డం వ‌ల్ల క్యాల‌రీలు అధిక‌మై బ‌రువు పెరిగే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. బరువు త‌గ్గాలంటే.. ఉద‌యం కేవ‌లం నిమ్మ‌ర‌సం, తేనె నీళ్ల‌ను మాత్ర‌మే తాగాలి. అలా చేస్తేనే బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. దీని వ‌ల్ల పెద్ద‌గా ఆక‌లి కూడా వేయ‌దు. బ‌రువు తగ్గ‌డం తేలిక‌వుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.